షారూక్‌ఖాన్(shah Rukh Khan) హీరోగా వచ్చిన రయీస్ సినిమా గుర్తుందా? 2017లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది.. ఇందులో షారూక్ సరసన నటించింది పాకిస్తాన్‌కు చెందిన మహిరా ఖాన్(Mahira Khan). ఈమెకు పాకిస్తాన్‌లోనే(Pakistan) కాదు, ఇండియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.2006లో వీజేగా కెరీర్‌ను మొదలుపెట్టిన మహిరా ఖాన్ తర్వాత ప్రముఖ పాకిస్తానీ దర్శకుడు షోయబ్ మన్సూర్ దర్శక్వంత వహించిన బోల్ సినిమాలో నటించింది.
షారూక్‌ఖాన్(shah Rukh Khan) హీరోగా వచ్చిన రయీస్ సినిమా గుర్తుందా? 2017లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది.. ఇందులో షారూక్ సరసన నటించింది పాకిస్తాన్‌కు చెందిన మహిరా ఖాన్(Mahira Khan). ఈమెకు పాకిస్తాన్‌లోనే(Pakistan) కాదు, ఇండియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.2006లో వీజేగా కెరీర్‌ను మొదలుపెట్టిన మహిరా ఖాన్ తర్వాత ప్రముఖ పాకిస్తానీ దర్శకుడు షోయబ్ మన్సూర్ దర్శక్వంత వహించిన బోల్ సినిమాలో నటించింది. అలాగే హమ్‌సఫర్(Hamsafar) అనే టీవీ షో కూడా మహిరాకు మంచి గుర్తింపును తెచ్చింది. అటు పిమ్మట 2017లో రయీస్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారూక్ హీరోగా నటించాడు. షారూక్, మహిరా కెమెస్ట్రీ ప్రేక్షకులకు అమితంగా ఆకట్టుకుంది. సినిమా కమర్షియల్‌గా హిట్టయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 218 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది.
సినిమాల్లో రాకముందు మహిరా ఖాన్ అనేక కష్టాలను అనుభవించింది. 17 ఏళ్ల వయసులో చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లింది మహిరా. అక్కడ తన వ్యక్తిగత ఖర్చుల కోసం టాయిలెట్లను క్లీన్ చేయడం, ఇళ్లు తుడవడం(House chores) వంటి పనులు చేసింది. తర్వాత మహిరా లాస్ ఏంజిలిస్‌లోని ఓ దుకాణంలో క్యాషియర్‌గా పని చేసింది. ఆమె ఏం చెప్పిందంటే 'నా జీవితంలో అత్యంత కష్టమైన రోజులు కూడా చూశాను. ప్రజల కోసం నా వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నాను. నేను లాస్‌ఎంజిల్స్‌లో ఉన్న సమయంలో ఫ్లోర్‌లు, టాయిలెట్లను కూడా శుభ్రం చేశాను. ఇప్పుడు మీరు నన్ను చాలా గౌరవిస్తారు. ఒక సమయంలో రెస్టారెంట్‌కు వెళ్లి నేను, నా సోదరుడు కలిసి ఒక భోజనాన్ని తిన్నాం. నా జీవితంలో ఎదురైన ఇలాంటి అనుభవాలను బయటికి చెప్పకుండా ఉండలేను" అని మహిరా తెలిపారు. ప్రస్తుతం మహీరా ఖాన్ పాకిస్తాన్‌లో అత్యంత ధనిక నటిగా నిలిచింది. పాకిస్తాన్‌లో అత్యధిక పారితోషికం(Remuneration) తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్‌కు మూడు లక్షల రూపాయల నుంచి అయిదు లక్షల రూపాయల వరకు తీసుకుంటోంది. జో బచాయ్ హైన్ సాంగ్ సమైత్ లో పేరుతో రాబోయే పాకిస్తాన్ మొదటి ఒరిజినల్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కోసం మహిరా ఖాన్ ఫవాద్ ఖాన్‌తో నటించనుంది.