సూర్యకాంతానికి(Suryakantham) చదువంటే పంచప్రాణాలని ఇంతకు ముందు చెప్పుకున్నాంగా! చిన్నప్పడు చదవుమీద ఎక్కువ ధ్యాస ఉండేది. సరే.. సినిమాల్లోకి వచ్చి అక్కడ స్థిరపడిన తర్వాత మళ్లీ చదవుమీద మనసుపోయిందామెకు.
సూర్యకాంతానికి(Suryakantham) చదువంటే పంచప్రాణాలని ఇంతకు ముందు చెప్పుకున్నాంగా! చిన్నప్పడు చదవుమీద ఎక్కువ ధ్యాస ఉండేది. సరే.. సినిమాల్లోకి వచ్చి అక్కడ స్థిరపడిన తర్వాత మళ్లీ చదవుమీద మనసుపోయిందామెకు. బెనారస్ హిందూ యూనివర్సిటీ(Banaras Hindu University) నుంచి ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేయాలనుకున్నారు. రేయింబవళ్లు చదువే చదువు. నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు. నిద్రలేమితో షూటింగ్‌కు వస్తున్న సూర్యకాంతాన్ని చూసి కన్నాంబకు(Kannamba) ఎందుకో అనుమానం వచ్చింది. సూర్యకాంతానికి తెలియకుండా ఆమె ఇంటికి వెళ్లారు కన్నాంబ. విషయం తెలుసుకున్నారు. గట్టిగా కేకలేశారు. 'నువ్వు సహజ నటివి. ఏ కోటిమందికో దొరికే వరమిది. ముందు ఆరోగ్యం చూసుకో. చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చు' అంటూ హాల్ టికెట్ చించేశారు కన్నాంబ. అలా డిగ్రీ చేయాలన్న సూర్యకాంతం కోరిక తీరలేదు. చదువు మీద ఉన్న ప్రేమతో ఆమె చాలా విద్యాసంస్థలకు విరాళాలు ఇచ్చారు. కొద్ది రోజుల్లో పోతారనగా సూర్యకాంతానికి పద్మావతి మహిళా యూనివర్సిటీ(Padmavati women university) గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సంఘటన కలిగించిన ఆనందం చెప్పనలవి కాదు. ఎన్ని అవార్డులు తీసుకున్నా దక్కని తీయని అనుభూతి ఈ గౌరవంతో లభించిందని సూర్యకాంతం మురిసిపోతూ చెప్పారప్పుడు.