ఒక పాట అదీ ఓ తెలుగు సినిమా పాట 60 ఏళ్లుగా సజీవంగా నిలుస్తూ రావడమన్నది అపురూపమైన విషయం! ఆ మాటకొస్తే ఆ పాట మరో వందేళ్ల పాటు కూడా ప్రజల పెదాల్లో నానుతూనే ఉంటుంది. ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటుందనడం సబబేమో! వెలుగు నీడలు(Velugu Nidalu) సినిమాలో పాడవోయి భారతీయుడా ఇడి పాడవోయి విజయగీతికా అన్న ఆ పాటను స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంలో మరోసారి స్మరణకు తెచ్చుకుందాం! ముందుగా ఆ పాట మొత్తాన్ని ఓసారి పరికిద్దాం.

ఒక పాట అదీ ఓ తెలుగు సినిమా పాట 60 ఏళ్లుగా సజీవంగా నిలుస్తూ రావడమన్నది అపురూపమైన విషయం! ఆ మాటకొస్తే ఆ పాట మరో వందేళ్ల పాటు కూడా ప్రజల పెదాల్లో నానుతూనే ఉంటుంది. ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటుందనడం సబబేమో! వెలుగు నీడలు(Velugu Nidalu) సినిమాలో పాడవోయి భారతీయుడా ఇడి పాడవోయి విజయగీతికా అన్న ఆ పాటను స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంలో మరోసారి స్మరణకు తెచ్చుకుందాం! ముందుగా ఆ పాట మొత్తాన్ని ఓసారి పరికిద్దాం.

పాడవోయి భారతీయుడా
ఆడిపాడవోయి విజయగీతికా II పాడవోయి II

నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం ఓ ఓ ఓ II పాడవోయి II
స్వాతంత్ర్యం వచ్చేననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చేననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా II పాడవోయి II

ఆకాశం అందుకునే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
ఆకాశం అందుకునే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి, బంధుప్రీతి, చీకటిబజారు
అలముకున్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితి
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితి
పదవి వ్యామోహాలు కులమత భేదాలు
భాషా ద్వేషాలు చెలరేగే నేడు
పదవి వ్యామోహాలు కులమత భేదాలు
భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకునేవాడే..
ప్రతి మనిషి మరొయొకని దోచుకునేవాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునే వాడే
స్వార్థమీ అనర్థ కారణం
అది చంపుకొనుటే క్షేమదాయకం
స్వార్థమీ అనర్థ కారణం
అది చంపుకొనుటే క్షేమదాయకం
స్వార్థమీ అనర్థ కారణం
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం... నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం.. నీ లక్ష్యం
సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
ఏకదీక్షతో గమ్యం చేరిననాడే
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభసందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభసందేశం
ఆ.. హా.. హా...హా.. హా

ఇదీ ఆ పాట.. వెలుగునీడలు సినిమా 1961లో వచ్చింది. అంటే ఇప్పటికీ 62 ఏళ్లయ్యిందన్నమాట! ఇన్నేళ్లుగా ఈ పాట అప్పుడే పూసిన రోజాలా తాజాగా ఉందంటే అది ఆ పాటను రాసిన శ్రీశ్రీ(sreesree) గొప్పతనం! ఈ పాటకు పెండ్యాల నాగేశ్వరరావు(Pendyala Nageswara Rao) స్వరాలు అందించారు. ఘంటసాల, సుశీల బృందం ఆలపించారు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు(Akkineni nageswar rao), రాజసులోచన ప్రధాన పాత్రధారులుగా అభినయించారు. ఆ అంతర్నాటకాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులుగా రేలంగి, సావిత్రి(Savitri) తదితరులు కనిపిస్తారు. తర్వాతకాలంలో నృత్య దర్శకుడిగానూ, దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్న కె.ఎస్‌.రెడ్డి(KS Redddy) ఈ పాటలో ఓ గ్రూపు డాన్సర్‌గా కనిపించడం విశేషం. అప్పట్లో మహాకవి శ్రీశ్రీ రోజుకు రెండు మూడు పాటలను అవలీలగా రాసేవారు. కానీ ఈ పాటను రాయడానికి మాత్రం ఆయనకు పదిహేను రోజులు పట్టింది. శ్రీశ్రీకి అఖండ కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టిన పాటలలో ఇది ముందు వరుసలో ఉంటుంది.

శ్రీశ్రీకి కూడా ఈ పాటంటే చాలా ఇష్టం. అందుకే తన సినీ గీతాల సంకలనానికి పాడవోయి భారతీయుడా అని పేరు పెట్టుకున్నారు. ఈ పాట తిశ్రంలో సాగుతుంది. సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం దగ్గర నుంచి చతురస్రంలోకి మారుతుంది. పాట చివరలో తాళగతిని మారిస్తే బాగుంటుదన్న సలహా ఇచ్చింది కూడా శ్రీశ్రీనే! అందుకే చివర్లో పాట ఊపందుకుంటుంది. పదవి వ్యామోహాలు చరణానికి ముందు శివరంజని రాగంలో, మిగిలిన చరణాలను మోహనరాగంలో, పల్లవిని శంకరాభరణంలో కంపోజ్‌ చేశారు పెండ్యాల మాస్టారు! ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావుకు ఈ పాట మిక్కిలి ఇష్టం! ' మా సాహిత్యాన్ని చదివి సినిమాల్లోకి వెళ్లిపోయావనే బాధ ఉండేది. కానీ ఈ పాట విన్నాక ఆ బాధ పోయింది' అని ఈ చిత్ర నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుతో ఆయన అన్నారట! అప్పటి ఆర్ధికమంత్రిగా ఉన్న కాసుబ్రహ్మానందరెడ్డి కూడా ఈ పాటను చూసి ముచ్చటపడిపోయారు.

సినిమా చూసి అర్జెంట్‌గా రమ్మని దుక్కిపాటికి కబురు పెట్టారు. దుక్కిపాటి ఆయన దగ్గరకు వెళ్లారు. 'నేను సినిమాలు బాగా చూస్తానని మీకు తెలుసుగా! నిన్ననే తాడేపల్లిగూడెంలోని రేలంగి సొంత థియేటర్‌లో మీ వెలుగు నీడలు సినిమా చూశాను. ఏం పాటండి అది.. మరో 50 ఏళ్లు అయినా సరే సజీవంగా ఉంటుంది' అంటూ ఈ పాటను తెగ ప్రశంసించారు కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయన అన్నారని కాదు కానీ ఇప్పుడు పాడుకున్నా సరే ఇవాళే శ్రీశ్రీ స్పందించి రాసినట్టుగా ఉంటుంది. అధిక ధరలు, నిరుద్యోగం, అవినీతి, బంధుప్రీతి ఈ జాడ్యాలు ఇప్పటికీ ఉన్నాయి. కొసమెరుపు ఏమిటంటే ప్రభుత్వ నిబంధనల దృష్ట్యా మొదట్లో ఈ పాటను వినిపించడానికి ఆలిండియా రేడియో వాళ్లు తెగ ఇబ్బంది పడ్డారు. తర్వాత ఆ పాటలోని బలమేమిటో తెలుసుకుని, మొహమాటాన్ని పక్కనపెట్టేసి ప్రసారం చేయడం మొదలుపెట్టారు. ప్రతీ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ పాట రేడియోలో తప్పనిసరిగా వస్తుంది. విన్నవారికి ఆనందం ఇస్తుంది..

Updated On 14 Aug 2023 4:38 AM GMT
Ehatv

Ehatv

Next Story