మన హీరోయిన్లు అందంలోనే కాదు చదువులోనూ మేటి..!

దక్షిణ భారత నటీమణులు తమ అందం, నటనతో ఆకట్టుకోవడమే కాకుండా ఇందులో చాలా మంది ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే పేరున్న డిగ్రీలతో చదువు పూర్తి చేశారు.
సాయి పల్లవి (Sai Pallavi): అందం, ప్రఖ్యాత డ్యాన్సర్ సాయి పల్లవి తమిళం, తెలుగు, మలయాళ చిత్రాలలో నటనకు ప్రసిద్ది చెందింది. సాయి పల్లవి జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ కాలేజీ నుంచి MBBS పట్టా పొందారు.
కీర్తి సురేష్ (Keerthy Suresh): కీర్తి ఇటీవలే పెళ్లి చేసుకుంది. ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళ సినిమాలలో పనిచేసింది. నటి చివరిగా బేబీ జాన్‌లో కనిపించింది. కీర్తి పెరల్ అకాడమీ నుంచి ఫ్యాషన్ డిజైన్‌లో గ్రాడ్యుయేట్.
రష్మిక మందన్న (Rashmika Mandhann): M.Sలో జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ మరియు సైకాలజీలో నాలుగు సంవత్సరాల డిగ్రీని రష్మిక మందన్న పూర్తి చేసింది. రామయ్య కాలేజ్ లో ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ మరియు కామర్స్ పూర్తి చేసింది.
శ్రీలీల (Sreeleela): కన్నడ చిత్రం కిస్‌లో అరంగేట్రం చేసిన నటి. ఆమో తల్లి తల్లి గైనిక్ డాక్టర్. మొదట్లో వైద్య వృత్తిని కొనసాగించడానికి శ్రీలీలను ప్రోత్సహించింది. శ్రీలీల 2021లో MBBS పూర్తి చేసి చివరికి సినిమా రంగానికి మారిపోయారు.
సమంత రూత్ ప్రభు (Samanth Rooth Prabhu): మరొక నటి, సమంతా రూత్ ప్రభు, ఉన్నత విద్యావంతురాలు.. చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నారు.
అనుష్క శెట్టి (Anushka Shetty): బాహుబలిలో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి 50కి పైగా సినిమాల్లో నటించింది. ఆమె తన చలనచిత్ర వృత్తిని ప్రారంభించే ముందు బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Sing): రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాలలో సుపరిచితురాలు. ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి గణితంలో బ్యాచిలర్ డిగ్రీతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
నయనతార (Nayanathara): ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పిలుచుకునే నయనతార ఇంగ్లీష్ లిటరేచర్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉంది.
