'ఆహా'(Aha) ఓటీటీ(OTT) ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫాం. మై హోమ్ గ్రూప్‌(My Home Group) అధినేతతో పాటు సినీ నిర్మాత అల్లు అరవింద్‌(Allu Arvind) కలిసి అట్టహాసంగా 'ఆహా' ఓటీటీని ప్రారంభించారు. దీనికి ప్రముఖ హీరో విజయ్‌దేవరకొండ(Vijay Devarkonda) కూడా ప్రమోషన్‌ చేశారు. విజయదేవరకొండ, దర్శకుడి పైడిపల్లి వంశీ కూడా ఇందులో పార్ట్‌నర్స్‌గా ఉన్నారని సమాచారం. గీతా ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో నిర్మించిన చిత్రాలను ఇందులో చేర్చారు.

'ఆహా'(Aha) ఓటీటీ(OTT) ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫాం. మై హోమ్ గ్రూప్‌(My Home Group) అధినేతతో పాటు సినీ నిర్మాత అల్లు అరవింద్‌(Allu Arvind) కలిసి అట్టహాసంగా 'ఆహా' ఓటీటీని ప్రారంభించారు. దీనికి ప్రముఖ హీరో విజయ్‌దేవరకొండ(Vijay Devarkonda) కూడా ప్రమోషన్‌ చేశారు. విజయదేవరకొండ, దర్శకుడి పైడిపల్లి వంశీ కూడా ఇందులో పార్ట్‌నర్స్‌గా ఉన్నారని సమాచారం. గీతా ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో నిర్మించిన చిత్రాలను ఇందులో చేర్చారు. తెలుగు ల్యాంగ్వేజ్‌లో ప్రారంభమైన ఈ ఓటీటీ తమిళనాడులో కూడా ప్రారంభించారు. ప్రారంభంలో ఓటీటీకి తెలుగు సబ్‌స్క్రైబర్లు పెరిగినప్పటికీ సినిమాల విషయంలో జరిగిన పొరపాట్ల కారణంగా గత కొంత కాలంగా వినియోగదారులు ఆహా నుంచి వెళ్లిపోతున్నారు. టాలీవుడ్‌ పెద్ద హీరోల సినిమాలు కొనలేకపోవడం, చిన్న సినిమాలు, డబ్బింగ్‌ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంతో యూజర్లు వెళ్లిపోతున్నారు.

ఆహాలో బాలకృష్ణతో(Balakrishna) నిర్వహించిన అన్‌స్టాపబుల్‌(Unstopable) షో తప్ప ఈ ఓటీటీలో అన్నీ నాసిరకం షోలు, నాసిరకం సినిమాలే ఉండడం నష్టాలకు ప్రధాన కారణం. బాలకృష్ణ షో అన్‌స్టాపబుల్‌ షోకు విపరీతమైన ప్రేక్షకాదారణ పొందినా దీనిని నిలబెట్టులేకపోయింది యాజమాన్యం. చంద్రబాబు(Chandrababu), ప్రభాస్‌(Prabhas) వంటి వారితో బాలకృష్ణ షో చేయడంతో ఆహాకు క్రేజ్‌ పెరిగిందే తప్ప ఆహా గొప్పతనం ఏమీ లేకపోవడం కూడా కారణమంటున్నారు. గతంలో పెద్ద పెద్ద నగరాల్లో వచ్చిన సినిమాలు.. ఆరు నెలల తర్వాత చిన్నచిన్న పట్టణాలకు వచ్చినట్లు.. ఇప్పుడు కూడా పలు సినిమాలు ఇతర ఓటీటీల్లోకి వచ్చిన తర్వాత.. అవే సినిమాలు ఆహాలో దర్శనమివ్వడంతో ఆ సినిమాలు అప్పటికే చూడడంతో ఇక్కడ ఆదరణ పొందలేదు. కొన్ని డబ్బింగ్‌ సినిమాలు ఆహాలో ముందుగా వచ్చినప్పటికీ ఆయా భాషలు వచ్చినవారు అప్పటికే ఆ సినిమాలు చూసి ఉండడంతో అవే సినిమాలను ఓటీటీలో చూసేందుకు ఇష్టపడకపోవడం కూడా కారణమంటున్నారు.

గతంలో దాదాపు 900 కోట్ల వెచ్చించి ఆహాను కొనుగోలు చేద్దామని పలు ఆఫర్‌ వస్తే యాజమాన్యం తిరస్కిరించిందట. అయితే 2022లో 26 కోట్ల నష్టాల్లో ఉన్న ఆహా 2023 మార్చి త్రైమాసికానికి దాదాపు రూ.76 కోట్ల నష్టాలను చవిచూసింది. దీంతో ఆహా మార్కెట్‌ దెబ్బతినడంతో ఇప్పుడు 300 కోట్లు పెట్టేందుకు కూడా ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ఆ మధ్య కాలంలో రిలయెన్స్(Reliance) ఆధ్వర్యంలో వచ్చిన జీ సినిమా(Jio Cinema) కూడా ఆహాతో టైయప్‌ అవుతాయని వచ్చాయి.

దేశంలోనే పెద్ద నిర్మాతగా పేరున్న అల్లు అరవింద్‌, ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మైహోం గ్రూప్స్‌ అధినేత రామేశ్వరరావు(Rameswar Rao) ఆధ్వర్యంలో మార్కెట్లోకి వచ్చిన 'ఆహా'కు నిధుల కొరత అంటూ ఉండదు. ఎన్ని కోట్లయినా పెట్టి సినిమాలు కొనుగోలు చేసే కెపాసిటీ వీరికి ఉంది. పెద్ద సినిమాలను ఓన్‌ చేసుకోవడంలో ఆహా ఎందుకు విఫలమైందోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్భాటంగా ఆహాను ప్రారంభించినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా హాట్‌స్టార్, అమెజాన్‌ ప్రైమ్‌, జీసినిమాలాంటి ప్రధాన ఓటీటీలతో ఉన్న పోటీని ఆహా తట్టుకోలేకపోయింది. నష్టాలతో ఉన్న ఆహాను అమ్మేందుకు దాని యాజమాన్యం ఇప్పుడు సిద్ధమైందని వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Updated On 12 Jan 2024 1:53 AM GMT
Ehatv

Ehatv

Next Story