సోషల్ మీడియా(Social media) పుణ్యమా అని పాపులరైనవాళ్లు చాలా మందే ఉంటారు. యూ ట్యూబ్ ఛానెళ్లు అంటే ఏమో అనుకోవచ్చు. ప్రధాన మీడియా కూడా ఇంకేం వార్తలు లేనట్టు లేనిపోనివాటిని ప్రయారిటీ ఇస్తున్నది. పేరు తెలియనవారిని కూడా ఫేమస్ చేస్తున్నది. మొన్నామధ్య మడత కుర్చీ తాత(Kurchi tatha).. ఇప్పుడేమో కుమారి ఆంటీ(Kumari aunty)! వీరిద్దరి మధ్యలో కూడా పాపులరైనవారు బోల్డంత మంది ఉన్నారు. కుమారి ఆంటీ గురించి సోషల్ మీడియాలో వచ్చేసరికి ఆమె హోటల్‌కు విపరీతమైన తాకిడి వచ్చింది.

Kumari Aunty Documentry
సోషల్ మీడియా(Social media) పుణ్యమా అని పాపులరైనవాళ్లు చాలా మందే ఉంటారు. యూ ట్యూబ్ ఛానెళ్లు అంటే ఏమో అనుకోవచ్చు. ప్రధాన మీడియా కూడా ఇంకేం వార్తలు లేనట్టు లేనిపోనివాటిని ప్రయారిటీ ఇస్తున్నది. పేరు తెలియనవారిని కూడా ఫేమస్ చేస్తున్నది. మొన్నామధ్య మడత కుర్చీ తాత(Kurchi tatha).. ఇప్పుడేమో కుమారి ఆంటీ(Kumari aunty)! వీరిద్దరి మధ్యలో కూడా పాపులరైనవారు బోల్డంత మంది ఉన్నారు. కుమారి ఆంటీ గురించి సోషల్ మీడియాలో వచ్చేసరికి ఆమె హోటల్‌కు విపరీతమైన తాకిడి వచ్చింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) ఆమె హోటల్‌కు వెళ్లిన తర్వాత కుమారి ఆంటీ చాలా ఫేమస్ అయ్యింది. దీంతో యూ ట్యూబర్స్ అందరూ ఆమె వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ బాగా పికప్ అయ్యింది. అదే సమయంలోనే ఆమెకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నదని చెప్పి పోలీసులు అమె హోటల్‌ను మూసేశారు. సీఎం రేవంత్(CM Revanth reddy) జోక్యంతో మళ్లీ ఆమె హోటల్ ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఆమె పాపురాలిటీ ఆమె బయోపిక్(Biopic) తీసేవరకు వెళ్లింది. అసలు కుమారి ఆంటీ ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? హోటల్ బిజినెస్ కంటే ముందు ఆమె ఏం చేసింది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్(OTT Platform) నెట్‌ఫ్లిక్స్(Netflix) ఓ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నదట! అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇప్పటి వరకైతే అధికారిక ప్రకటన రాలేదు.
