96వ అకాడమీ అవార్డ్స్‌లో ఓపెన్‌హైమర్‌లో తన పాత్రకు గానూ సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ను గెలుచుకున్నాడు

96వ అకాడమీ అవార్డ్స్‌లో ఓపెన్‌హైమర్‌లో తన పాత్రకు గానూ సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ను గెలుచుకున్నాడు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన అణు-ఆయుధాల శాస్త్రవేత్త J రాబర్ట్ ఓపెన్‌హైమర్ బయోపిక్‌లో మర్ఫీ టైటిల్ రోల్ చేశాడు. భారీగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డులు కూడా దాసోహమయ్యాయి. ఇది మర్ఫీ మొదటి ఆస్కార్ నామినేషన్. బాఫ్టాస్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్‌లో ఉత్తమ నటుడు, గోల్డెన్ గ్లోబ్స్‌లో ఉత్తమ నటుడు (డ్రామా)తో సహా పలు అవార్డులను గెలుచుకున్న మర్ఫీకి ఆస్కార్ అవార్డు కూడా వరించింది. ఇక ఉత్తమ చిత్రంగా ఓపెన్‌హైమర్ నిలిచింది. ఉత్తమ దర్శకుడుగా క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్) అవార్డు అందుకున్నారు.

మిగిలిన అవార్డులు
ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటి: డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)
బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌: ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: హెయటే వన్ హోయటేమా (ఓపెన్ హైమర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియూపోల్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ)
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
ఉత్తమ సౌండ్: ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)
ఉత్తమ ఒరిజనల్ స్కోర్: ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్‌న్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ మూవీ)

Updated On 10 March 2024 9:24 PM GMT
Yagnik

Yagnik

Next Story