నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకోవడం పట్ల యావత్ ఇండియన్ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలిబ్రిటీలు, పొలిటికల్ దిగ్గజాలు కూడా RRR యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకోవడం పట్ల యావత్ ఇండియన్ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలిబ్రిటీలు, పొలిటికల్ దిగ్గజాలు కూడా RRR యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో నాటు నాటు సాంగ్, రాజమౌళి హ్యాష్ ట్యాగ్స్ టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి. భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది RRR మూవీ. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. 95వ అకాడమీ అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. ప్రపంచ సినీ చరిత్రలో ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారే. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్‌గా చరిత్ర సృష్టించింది. నాటు నాటు స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఈ ఆస్కార్ అవార్డు అందుకున్నారు.
అయితే నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం పట్ల మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశం గర్వించేలా చేసిన రాజమౌళిని పొగుడుతూ RRR యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు చిరంజీవి. "భారతీయ చిత్రానికి ఆస్కార్ రావడం అనేది ఓ కలలా ఉండేది. ఆ కల RRR సినిమాతో సాకారమయ్యింది. ఇండియాలోని కొన్ని కోట్ల హృదయాలు గర్వపడేలా చేస్తూ ఇంతటి గొప్ప ఖ్యాతీని తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఇది దేశం గర్వించే మూమెంట్" అని పేర్కొంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
పాన్ ఇండియా మూవీగా వచ్చిన RRR సినిమాలోని ఈ నాటు నాటు పాటకు కీరవాణి సంగీతం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాల బైరవ పాడారు. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. ఈ సాంగ్ విడుదలైనప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. ఇప్పుడు ఆస్కార్ గెలుచుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. లాస్ ఏంజిల్స్ డోల్బీ థియేటర్ వేదికగా జరుగుతున్న ఆస్కార్ వేడుకకు ప్రపంచ సినీ ప్రముఖులు తరలి వచ్చారు. ఇందులో RRR టీమ్ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ బ్లాక్ సూట్ లో తెగ సందడి చేశారు.