Oscar Winners Felicitation Ceremony : ఆస్కార్ గ్రహీతలకు సన్మానం, ఏ మాత్రం పట్టించుకోని హీరోలు..
ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర నిర్మాత(RRR Producer) డీవీవీ దానయ్య(D. V. V. Danayya) లేకుండా ఆస్కార్(Oscar) గ్రహీతలకు అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని నిర్మాత నట్టికుమార్(Natti kumar) మండిపడ్డారు సరే! ఆయన ఆవేశం కొద్దీ ఏదోదే అన్నారే అనుకుందాం! నిజంగా కీరవాణి(Keeravani), చంద్రబోస్(Chandrabose)లకు ఘనసన్మానం జరిగిందా? ఇండస్ట్రీ మొత్తం తరలిరాకపోయినా సగం పరిశ్రమ అయినా ఈ కార్యక్రమానికి వచ్చిందా? కీరవాణి, చంద్రబోస్‌లను తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్కరిస్తున్నట్టు చెప్పారు కదా! పరిశ్రమ తరఫున సన్మానం అంటే కనీసం 90 శాతం అయినా రావాలి కదా!

Oscar Winners Felicitation Ceremony
ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర నిర్మాత(RRR Producer) డీవీవీ దానయ్య(D. V. V. Danayya) లేకుండా ఆస్కార్(Oscar) గ్రహీతలకు అభినందన సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని నిర్మాత నట్టికుమార్(Natti kumar) మండిపడ్డారు సరే! ఆయన ఆవేశం కొద్దీ ఏదోదే అన్నారే అనుకుందాం! నిజంగా కీరవాణి(Keeravani), చంద్రబోస్(Chandrabose)లకు ఘనసన్మానం జరిగిందా? ఇండస్ట్రీ మొత్తం తరలిరాకపోయినా సగం పరిశ్రమ అయినా ఈ కార్యక్రమానికి వచ్చిందా? కీరవాణి, చంద్రబోస్‌లను తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్కరిస్తున్నట్టు చెప్పారు కదా! పరిశ్రమ తరఫున సన్మానం అంటే కనీసం 90 శాతం అయినా రావాలి కదా! కానీ అభినందన సభలో అదేం కనిపించలేదు. చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna), మహేశ్‌బాబు(Mahesh Babu), ప్రభాస్(Prabhas), అల్లు అర్జున్(Allu Arjun) వీరి జాడే లేదు. పోనీ వర్ధమాన హీరోలైనా వచ్చారా అంటే వారూ డుమ్మా కొట్టారు. ముగ్గురంటే ముగ్గరు హీరోలు మాత్రమే వచ్చారు. వారెవరయ్యా అంటే రాజశేఖర్(Rajashekar), సుశాంత్(Sushanth), రానా(Rana).. అంతే... ఈ ముగ్గరే సభలో కనిపించారు.
ఎక్కడో విదేశాల్లో ఉన్నారనుకుంటే అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్(Hyderabad)లో ఉండి కూడా సభకు రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మహేశ్‌బాబు అంటే హైదరాబాద్‌లో లేరు. ఓకే, ప్రభాస్ ఇక్కడే ఉన్నారు కదా! చిరంజీవి, వెంకటేశ్, రవితేజ, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఇక్కడే ఉన్నారు. వారిని నిర్వాహకులు పిలవలేదా? పిలిచినా మనకెందుకులే అని వారు అనుకున్నారా? అన్నట్టు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా రాలేదు. హీరోలే కాదు, దర్శకులు కూడా గైర్హాజరయ్యారు. త్రివిక్రమ్ వచ్చారు కానీ కాసేపు కూడా ఉండలేదు. రామ్‌చరణ్(Ram Charan) భార్యతో కలిసి మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆయన ఎందుకు రాలేదో తెలియదు. కాకపోతే అల్లు అరవింద్, దిల్‌రాజు, సురేశ్‌బాబు వంటి స్టార్ ప్రొడ్యుసర్లు మాత్రం ముగ్గురు నలుగురు వచ్చారు.. అదే సంతోషం!
