ఓ నలభై ఏళ్ల కిందట పాటలు పాడే గాయనీగాయకులు(Singer) రెమ్యూనిరేషన్(Remuneration) కింద అయిదొందలో వెయ్యో ఇచ్చేవారు. ఆ రోజల్లో అదే పెద్ద మొత్తం అనుకోండి.. నిజానికి సినిమా హిట్టవ్వడంలో సంగీతం(Music), పాటలు(Songs) ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తాయి. యావరేజ్‌గా ఉన్న సినిమాలో ఓ హిట్‌ సాంగ్ పడిందే అనుకోండి..

ఓ నలభై ఏళ్ల కిందట పాటలు పాడే గాయనీగాయకులు(Singer) రెమ్యూనిరేషన్(Remuneration) కింద అయిదొందలో వెయ్యో ఇచ్చేవారు. ఆ రోజల్లో అదే పెద్ద మొత్తం అనుకోండి.. నిజానికి సినిమా హిట్టవ్వడంలో సంగీతం(Music), పాటలు(Songs) ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తాయి. యావరేజ్‌గా ఉన్న సినిమాలో ఓ హిట్‌ సాంగ్ పడిందే అనుకోండి.. అది కచ్చితంగా హిట్టవుతుంది. మరి సినిమా విజయవంతంలో అంత కీలక పాత్ర వహిస్తున్న సింగర్స్‌కు పెద్ద మొత్తం ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కాదు.. దక్షిణాదిలో టాప్ సింగర్‌ అయిన సిద్‌ శ్రీరామ్‌(Sid Sriram) ఓ పాటుకు మినిమం నాలుగు లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నాడు.

ప్రముఖ గాయకురాలు శ్రేయా ఘోషల్‌(Shreya Goshal) ఓ పాట కోసం పాతిక లక్షల వరకు తీసుకుంటున్నారు. సునిధి చౌహాన్‌(Sunidhi Chauhan), అర్జిత్‌ సింగ్‌ల(Arjith singh) పారితోషికం కూడా ఎక్కువే. వీరు పాటకు 20 నుంచి 22 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇక సోనూ నిగమ్‌, బాద్‌ షా అయిఏ 18 నుంచి 20 లక్షల వరకు ఛార్జ్‌ చేస్తున్నారు. షాన్‌, నేహా కక్కర్‌, మికా సింగ్‌, హనీ సింగ్‌ తదితరులు పాటకు పది లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు.

అన్నట్టు పాటకు మూడు కోట్ల రూపాయలు తీసుకునే గాయకుడు ఒకరు ఉన్నారు. ఆయనెవరో కాదు, ఆస్కార్‌ అవార్డు విజేత ఎ.ఆర్‌.రెహమాన్‌(A.R Rehaman).. దేశవ్యాప్తంగా ఉన్న గాయనీగాయకులలో రెహమానే(Rehman) టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు స్వతహాగా సంగీత దర్శకుడు అయిన రెహమాన్‌ అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటారు. అలా పాడినప్పుడు ఒక్కో పాటకు మూడు కోట్ల రూపాయల వరకు ఛార్జ్‌ చేస్తాడట! అయిదు కోట్ల రూపాయలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట! ఎంతైనా రెహమాన్‌...రెహమానే!

Updated On 27 Jun 2023 5:41 AM GMT
Ehatv

Ehatv

Next Story