ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ప్రతిష్టలను ద్విగుణీకృతం చేస్తూ, త్రిబుల్ ఆర్‌ చిత్రానికి గానూ నాటునాటు పాట ఆస్కార్‌ అవార్డ్‌ను గెలుచుకుంది. ఆస్కార్‌ వేదికపైన త్రిబుల్‌ ఆర్‌ సంగీత దర్శకుడు కీరవాణి, నాటునాటు గీత రచయిత చంద్రబోస్‌ నిలుచుని ఉంటే మన జాతీయపతాకం గర్వపడిన క్షణాలవి. ఫంక్షన్‌ జరిగిన హాలులో త్రిబుల్‌ ఆర్‌ కథానాయకులు రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, తదితరులుకూడా పాల్గొనడం ఆనందాన్ని కలిగించిన విషయం. సంబరాలు ప్రపంచమంతా జరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ప్రతిష్టలను ద్విగుణీకృతం చేస్తూ, త్రిబుల్ ఆర్‌ చిత్రానికి గానూ నాటునాటు పాట ఆస్కార్‌ అవార్డ్‌ను గెలుచుకుంది. ఆస్కార్‌ వేదికపైన త్రిబుల్‌ ఆర్‌ సంగీత దర్శకుడు కీరవాణి, నాటునాటు గీత రచయిత చంద్రబోస్‌ నిలుచుని ఉంటే మన జాతీయపతాకం గర్వపడిన క్షణాలవి. ఫంక్షన్‌ జరిగిన హాలులో త్రిబుల్‌ ఆర్‌ కథానాయకులు రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, తదితరులుకూడా పాల్గొనడం ఆనందాన్ని కలిగించిన విషయం. సంబరాలు ప్రపంచమంతా జరిగాయి. భారతదేశం మొత్తం మీద అదే సందడి. సరే ఇంక మన రెండు తెలుగు రాష్ట్రాలలో వేడుకలకు హద్దే లేదు. రామ్‌ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు వీరంగం తొక్కారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షల వెల్లువ పెల్లుబికింది.

కానీ అతి ముఖ్యమైన లేదా కీలకమైన పాయంటే మృగ్యమైపోయింది దారుణంగా. వాస్తవానికి నాటునాటు పాట సంగీతం పరంగా ఎంత గొప్పగా అందరినీ ఆకట్టుకుందో, దానికి చంద్రబోస్‌ రాసిన సాహిత్యం దారానికి అల్లిన పూల పరిమళంలా సువాసనలను గుబాళించింది. రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇరగదీసేశారు. అది కూడా ఓకే. కానీ, ఇందరి కృషికి, కల్సనాచాతుర్యానికి విజువల్‌ ఇంపాక్ట్‌ని క్రియేట్‌ చేసింది కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌. రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎన్నో వందల సాంగ్స్‌కి ఇంతవరకూ డాన్స్‌లు చేశారు. కానీ ఈ డాన్స్‌లో ఇద్దరికిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి అద్భుతంగా చేశారు. అలా అనడం కన్నా, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ అద్భుతంగా చేయించాడంటే సమంజసంగా ఉంటుందేమో. పాట సౌండ్‌ కన్నా, పాట విజువల్‌లోనే చెప్పలేనంత కిక్‌ దాగుంది. అటువంటిది, ప్రేమ్‌ రక్షిత్‌ పేరు ఎక్కడా సోదిలో లేకుండా పోయింది. ప్రేమ్‌ని పట్టించుకున్నదాఖలాలే లేవు ఎక్కడా కూడా.

అయితే ఆస్కార్‌ సంప్రదాయం ప్రకారం సంగీతదర్శకుడు, గీత రచయిత ఇద్దరినే ఆస్కార్‌ కమిటీ వేదికపైకి ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా ప్రేమ్‌ రక్షిత్‌కి ఆ అవకాశం దక్కలేదు. కానీ మనకి తెలుసు, ప్రేమ్‌ రక్షిత్‌ గనక అంత రసవత్తరంగా కొరియోగ్రాఫీ చేసి ఉండకపోతే ఆ పాటకంతటి ప్రాచుర్యం, ఫాలోయింగ్‌ వచ్చి ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదేమో. ఇటువంటి నియంత్రిత విధానాలలో చాలా సార్లు ప్రతిభ నైతికంగా పరాజయం పాలవుతుంటుంది. ఇది సార్వజనీనమైన విషయం. అందుకు ప్రేమ్‌ రక్షిత్‌ను మించిన తాజా ఉదాహరణ మరొకటి లేదు.

Updated On 14 March 2023 6:46 AM GMT
Ehatv

Ehatv

Next Story