హీరో ఎన్టీఆర్‌కు(Jr.NTR) అరుదైన గౌరవం లభించింది. ఆర్‌ఆర్‌ఆర్(RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కు ఇప్పుడు ఆస్కార్ యాక్టర్స్(Oscar Video) బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించారు. సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. దాంతో పాటుగా సినీ ప్రముఖులు, అభిమానుల శుభాకాంక్షలు కూడా మోతమోగిస్తున్నాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్(Academy of Motion Pictures and Arts) కొత్త సభ్యులను ఎంపిక చేసింది.

Oscar Member Jr.NTR
హీరో ఎన్టీఆర్‌కు(Jr.NTR) అరుదైన గౌరవం లభించింది. ఆర్‌ఆర్‌ఆర్(RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌కు ఇప్పుడు ఆస్కార్ యాక్టర్స్(Oscar Video) బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించారు. సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. దాంతో పాటుగా సినీ ప్రముఖులు, అభిమానుల శుభాకాంక్షలు కూడా మోతమోగిస్తున్నాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్(Academy of Motion Pictures and Arts) కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఎన్టీఆర్ పేరును అధికారికంగా ప్రకటించింది. ‘అంకితభావం కలిగిన ఈ నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. తెరపై వారి హావభావాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటీనటులను యాక్టర్స్ బ్రాంచ్‌లోకి ఆహ్వానిస్తున్నాం’ అని అకాడమీ పేర్కొంది. ఎన్టీఆర్‌తో పాటు నలుగురు హాలీవుడ్ నటులు కూడా ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర(Devara) అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది. ఇందులో జాన్వీకపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలన్ పాత్రను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు హృతిక్ రోషన్‌తో(Hrithik Roshan) కలిసి వార్ 2(War-2) అనే హిందీ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.
