ద‌క్షిణ కొరియా(South Korea) న‌టుడు లీ సున్ కున్(Sun kun) అనుమానాస్పద రీతిలో చనిపోయాడు(Death). అతడి శవాన్ని ఓ కారులో గుర్తించారు. మాదకద్రవ్యాలు సేవించి ఆత్మహత్య(Suicide) చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

ద‌క్షిణ కొరియా(South Korea) న‌టుడు లీ సున్ కున్(Lee Sun kyun) అనుమానాస్పద రీతిలో చనిపోయాడు(Death). అతడి శవాన్ని ఓ కారులో గుర్తించారు. మాదకద్రవ్యాలు సేవించి ఆత్మహత్య(Suicide) చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అక్టోబర్‌ నుంచి లీ సున్‌ కున్‌పై డ్రస్‌ కేసులో(Drugs Case) విచారణ జరుగుతోంది. లీ సున్‌ కున్‌ పేరు చాలా మంది ఇండియన్స్‌కు కూడా సుపరిచితమే. అనేక ఆస్కార్‌ అవార్డులు(Oscar awards) గెల్చుకున్న పారాసైట్‌(Parasite) సినిమాలో లీ సున్‌కున్‌ నటించాడు. సెంట్రల్‌ సియోల్‌లోని ఓ పార్క్‌ దగ్గర ఆగి ఉన్న కారులో 48 ఏళ్ల లీ సున్‌ కున్‌ను స్పృహలేని స్థితిలో గుర్తించారు. అయితే ఇతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. కాకపోతే ఇంట్లో అతడు ఓ లేఖ రాసి వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు.లీ సున్‌ కున్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నటి జియోన్‌ హై జిన్‌ను ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఇరవై ఏళ్లుగా ఇతడు సినీ పరిశ్రమలో ఉంటూ వస్తున్నాడు. సియోల్‌లోని(Seoul) ఓ బార్ ఉద్యోగితో క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు అతడిపై అనుమానాలున్నాయి. అతడు తీసుకున్న డ్రగ్స్‌ అక్రమమైనదని బహుశా అతడికి తెలియకపోవచ్చని కొందరు అంటున్నారు. త‌న ఇంట్లో చాలా సార్లు అతడు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఓ మ‌హిళ గ‌తంలో పోలీసుల‌కు చెప్పింది. కానీ ఆ ఆరోప‌ణ‌ల‌ను లీ సున్ కొట్టిపారేశాడు. కావలిస్తే లై డిటెక్టర్‌ పరీక్షలు కూడా చేసుకోవచ్చని సవాల్ విసిరాడు. డ్ర‌గ్స్ సంబంధిత నేరాలకు ద‌క్షిణ కొరియాలో కఠిన శిక్షలు ఉంటాయి.

Updated On 27 Dec 2023 3:05 AM GMT
Ehatv

Ehatv

Next Story