సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా 'ఊరుపేరు భైరవకోన'. ఈ సినిమా ప్రీమియర్స్ నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా 'ఊరుపేరు భైరవకోన'. ఈ సినిమా ప్రీమియర్స్ నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అంతేకాకుండా ఈ వీకెండ్ మంచి ఫన్ ఉన్న సినిమా కావడంతో అందరూ మొదటి ఆప్షన్ గా ఈ సినిమానే ఎంచుకున్నారు. ఈ నెల 16వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించి హిట్ గా నిలిచింది. మూడు రోజుల్లో ఈ సినిమా 20.30 కోట్లను వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో 3 రోజులలో సందీప్ కిషన్ చూసిన అత్యధిక వసూళ్లు ఇవేనని చెప్పాలి.

'భైరవకోన' అనే గ్రామంలోకి అడుగుపెట్టిన వారిని ఆ ప్రేతాత్మలు అంతం చేస్తూ ఉంటాయి. తన ప్రియురాలి ఆశయాన్ని నెరవేర్చడానికి గాను హీరో .. ఆ గ్రామంలోకి అడుగుపెట్టవలసి వస్తుంది. అప్పుడు తాను ఏం చేస్తాడు? అనేదే కథ.. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫాంటసీ టచ్ తో హారర్ థ్రిల్లర్ జోనర్లో కొనసాగుతుంది. వర్ష బొల్లమ్మ - కావ్య థాపర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మించారు. సినిమాపై నమ్మకం ఉన్న మేకర్స్ ముందుగానే ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 14న ప్రీమియర్ షోల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రీమియర్ షోల గ్రాస్ 1.1 కోట్లుగా ఉందని ట్రేడ్ వర్గాలు ఇంతకు ముందే తెలిపాయి.

Updated On 19 Feb 2024 1:54 AM GMT
Yagnik

Yagnik

Next Story