ఈరోజు (14 ఏప్రిల్) శుక్రవారంతో ఈ కేజీఎఫ్ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అయ్యింది. ఈ క్రమంలో మూవీ టీమ్... కేజీఎఫ్‌ (K.G.F:Chapter2) సెకండ్‌ పార్ట్‌కి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. అందులోనే పార్ట్‌-3 (K.G.F:Chapter3) కి సంబంధించిన చిన్న హింట్‏ను కూడా వదిలింది. అమ్మకిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. నిజంగా నెరవేరిందా? అంటూ వీడియోలో పార్ట్‌-3 ఖచ్చితంగా ఉంటుందని క్లియర్‏గా చెప్పేశారు.

కన్నడ నాట నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్త గుర్తింపు సాధించిన సినిమా కేజీఎఫ్ (K.G.F). రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా రెండో భాగం రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అయ్యింది. ఇక కేజీఎఫ్-3 పై కూడా హింట్ ఇచ్చారు మేకర్స్.

సౌత్‏లో తెలుగు, తమిళ సినిమాలు తప్పించి కన్నడ సినిమాలకు ఇతర ఇండస్ట్రీలలో పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. ఆ హీరోలకు కూడా పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. కానీ కన్నడ హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ (Bollywood) రేంజ్‏లో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్లలో కన్నడ వారే ఎక్కువ. అయితే కన్నడ సినిమాలకు మాత్రం కేజీఎఫ్ (K.G.F) వచ్చేవరకూ.. బయట మార్కెట్‏లో పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. డబ్బింగ్ చేసినా..ఖర్చులు కూడా వచ్చేవి కాదు.

కానీ ఎప్పుడైతే కేజీఎఫ్ (K.G.F) రిలీజ్ అయ్యి.. పాన్ ఇండియా రేంజ్‏లో సంచలనం సృష్టించిందో.. అప్పటి నుంచి... కన్నడ సినిమావైపు ఇండియా చూపు పడింది. ఇక సెకండ్‌ పార్ట్‌ కేజీఎఫ్‏తో దేశం మొత్తం ఊగిపోయింది. బాక్సాఫీస్‌ దగ్గర ఊచకోత అంటే ఏంటో నిరూపించింది. గతేడాది ఇదే రోజున భారీ అంచనాలతో రిలీజ్ అయిన కేజీఎఫ్.... అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ తీసుకువచ్చింది. ఒక్క కన్నడనే కాదు రిలీజైన ప్రతిభాషలోనూ కోట్లు కొల్లగొట్టింది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ దగ్గర వెయ్యి కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్‌లు రాబట్టి సంచలనం సృష్టించింది.

ఇక బాలీవుడ్‏లో కూడా వారి సినిమాలను వెనక్కి నెట్టి.. మరోసౌత్ సినిమా పెద్ద దెబ్బ కొట్టింది. ఇక ఈరోజు (14 ఏప్రిల్) శుక్రవారంతో ఈ కేజీఎఫ్ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అయ్యింది. ఈ క్రమంలో మూవీ టీమ్... కేజీఎఫ్‌ (K.G.F:Chapter2) సెకండ్‌ పార్ట్‌కి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. అందులోనే పార్ట్‌-3 (K.G.F:Chapter3) కి సంబంధించిన చిన్న హింట్‏ను కూడా వదిలింది. అమ్మకిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. నిజంగా నెరవేరిందా? అంటూ వీడియోలో పార్ట్‌-3 ఖచ్చితంగా ఉంటుందని క్లియర్‏గా చెప్పేశారు.

ఇక ఈ వీడియోను కేజీఎఫ్ (K.G.F)‏ను నిర్మించిన హోంబలే ఫిల్మ్‌ (Hombale Films) సంస్థ ఓ నోట్‌ను జతచేసింది. మరుపురాణి క్యారెక్టర్‌లు, యాక్షన్‌తో కెజిఎఫ్‌-2(K.G.F:Chapter2) ప్రయాణం అద్భుతంగా సాగింది. గ్లోబల్‌ రికార్డులతో పాటు అనేక హృదయాలను గెలుచుకుంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఇక పార్ట్ 3 ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ప్రభాస్‏తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. సలార్ తరువాత ఎన్టీఆర్‏తో సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్. మరి ఈ మధ్యలో కేజీఎఫ్‏కు టైమ్ ఎలా సెట్ చేసుకుంటాడో చూడాలి మరి.

Updated On 14 April 2023 7:38 AM GMT
Ehatv

Ehatv

Next Story