అనిల్ కపూర్(Anil kapoor) బాలీవుడ్ అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరు, నాలుగు దశాబ్దాల పాటు అనిల్ కపూర్ తన కెరీర్‌ను కొనసాగించారు.
అనిల్ కపూర్(Anil kapoor) బాలీవుడ్ అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరు, నాలుగు దశాబ్దాల పాటు అనిల్ కపూర్ తన కెరీర్‌ను కొనసాగించారు. 1980లలో మిస్టర్ ఇండియా, తేజాబ్, రామ్ లఖన్ వంటి హిట్‌లతో దూసుకెళ్లారు. యాక్షన్, డ్రామా, కామెడీతో ప్రేక్షకులు, విమర్శకుల మధ్య అభిమానాన్ని సంపాదించుకున్నారు. సునీత కపూర్‌తో వివాహ బంధంలో కొనసాగినప్పటికీ మరో నటి కిమీ కట్కర్‌తో(Kimmi katar) ఎఫైర్ ఉందని గుసగుసలు వినిపించాయి.
అనిల్ కపూర్, సునీతా కపూర్ బాలీవుడ్‌లో సాలిడ్ కపూల్. ఇద్దరూ 1984లో వివాహం చేసుకున్నారు. వీరికి సోనమ్, రియా, హర్ష్ వర్ధన్ కపూర్ సంతానం. అయితే, కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే కిమీ కట్కర్‌తో ఎఫైర్(affair) గురించి పుకార్లు వ్యాపించాయి. అనిల్ కపూర్- కిమీ కట్కర్ తరచుగా ఆఫ్-స్క్రీన్ లేదా ఆన్-స్క్రీన్‌లో సమయాన్ని వెచ్చించేవారు. అంతేకాకుండా పలు చిత్రాల్లో కిమీ కట్కర్‌కు ఆఫర్లు ఇవ్వాలని రిఫర్ చేసేవాడు. కొత్త చిత్రాల కోసం చిత్రనిర్మాతలకు ఆమె పేరును సిఫార్సు చేసేవాడు. అప్పట్లో సినిమాల్లో బోల్డ్ సన్నివేశాల్లో కూడా కిమీ నటించి మెప్పించింది.
ఆగ్ సే ఖేలేంగే, హుమ్లా, కాలా బజార్, ఇంతేకం, అభిమన్యు, సోనే పే సుహాగా వంటి అనేక చిత్రాలలో అనిల్ కపూర్ కిమీ కట్కర్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకుంది. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎఫైర్లకు దారి తీసింది. కానీ అతని భార్య సునీతా కపూర్ మొదట వాటిని నిరాధారమైన గాసిప్‌గానే భావించారు. అయితే ఒక సారి తన భర్త అనిల్ నటిస్తున్న సినిమా సెట్‌కు వెళ్లినప్పుడు కిమీతో ఒక గదిలో ఉండడం చూసింది. దీంతో అనిల్‌తో సునీత తీవ్రంగా ఘర్షణ పడింది. అనిల్‌ను వదిలిపెట్టి పిల్లలతో కలిసి తల్లిదండ్రులకు ఇంటికి వెళ్లిందని.. ఆ తర్వాత అనిల్ కపూర్ ఎంత ప్రయత్నించినా ఆమె రాజీపడలేదని సమాచారం. దీంతో వారిద్దరి మధ్య వైవాహిక బంధం తెగిపోయినట్లు బాలీవుడ్ వర్గాల బొగట్టా. అంతేకాదు అనిల్ కపూర్‌కు కిమీతో పాటు మాధురీ దీక్షిత్, శ్రీదేవి, శిల్పా శిరోద్కర్‌తో కూడా ఎఫైర్లు కొనసాగించాడని సమాచారం.