పెళ్లి రోజు అమ్మమ్మ చీర కట్టుకుంటా: సాయిపల్లవి

ఈ మధ్యకాలంలో మంచి ఆదరణ పొందుతున్న నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. సాయిపల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. తాను నటించిన అన్ని సినిమాల్లో సహజంగా కనపడేందుకే ఇష్టపడతారు. మేకప్‌ లేకుండా సాదాసీదాగా నటించేందుకు ఆమె ప్రాధాన్యత ఇస్తారు. సినీ విమర్శకులను సైతం తన నటనతో మెప్పిస్తూ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటిగా రాణిస్తోంది. ఈ మధ్యకాలంలో విడుదలైన అమరన్, తెలుగు సినిమా తండేల్‌ మంచి పాజిటివ్‌ టాక్‌ను సంపాదించిపెట్టాయి. తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోవాలన్న కోరిక ఉందన్నారు. తనకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన అమ్మమ్మ ఓ చీరను బహూకరించిందని.. తన పెళ్లికి అదే చీరను కట్టుకోవాలని చెప్పిందన్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆ చీరను కట్టుకుందామని దానిని దాచుకున్నట్లు తెలిపింది. 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమం సినిమాలో నటించే అవకాశం వచ్చిందని.. ఏదో ఒక రోజు ఉత్తమ నటి అవార్డు అందుకుంటానని ఆరోజు కూడా అమ్మమ్మ ఇచ్చిన చీరను కట్టుకొని అవార్డు ఫంక్షన్‌కు వెళ్తానని ఆమె వివరించింది.

ehatv

ehatv

Next Story