మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్(dulqer Salman) తండ్రి మమ్ముట్టీలాగే(Mammootty) వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. అవి కూడా ఎంపిక చేసుకున్న సినిమాలు మాత్రమే! అందుకే దుల్కర్‌ సినిమాలన్నీ విజయవంతం అవుతున్నాయి. బర్త్‌డే సందర్భంగా ఆ హీరో తన అభిమానులకు బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్స్‌ అందిస్తూ సంతోషపరుస్తున్నాడు. తాజాగా కొత్త సినిమా వార్త అందించారు.

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్(dulqer Salman) తండ్రి మమ్ముట్టీలాగే(Mammootty) వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. అవి కూడా ఎంపిక చేసుకున్న సినిమాలు మాత్రమే! అందుకే దుల్కర్‌ సినిమాలన్నీ విజయవంతం అవుతున్నాయి. బర్త్‌డే సందర్భంగా ఆ హీరో తన అభిమానులకు బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్స్‌ అందిస్తూ సంతోషపరుస్తున్నాడు. తాజాగా కొత్త సినిమా వార్త అందించారు. బాహుబలి స్టార్‌ దగ్గుబాటి రానాతో(Daggubati Rana) కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు కాంత(Kantha) అనే పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని చెబుతూ టైటిల్ లుక్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది.

నిలా ఫేమ్‌ సెల్వరాజ్‌(Selvaraj) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సెల్వరాజ్‌ తెరకెక్కించిన డ్యాకుమెంటరీ సిరీస్‌ ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌ ఆగస్టు 4వ తేదీన నెటిఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ఏ జోనర్‌లో రాబోతుదందనేది ప్రస్తానికి సస్పెన్స్‌గా ఉంది. లేటెస్ట్‌ టాక్‌ ప్రకారం దుల్కర్‌ సల్మాన్‌ ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కాంత తమను ఓ చోట కలిపిన ప్రాజెక్టు అని, అపారమైన ప్రతిభావంతులైన దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని రానా అన్నాడు. దుల్కర్‌, వేఫేరర్‌ బ్యానర్‌తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం పల్ల ఆనందిస్తున్నామన్నాడు. దుల్కర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ కాంత ప్రపంచంలోకి స్వాగతం అంటూ ట్వీట్‌ చేశాడు రానా.

Updated On 29 July 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story