ఇప్పుడు అందరి చూపు ఆదిపురుష్(Adipurush) మీదే ఉంది. పక్షం రోజులుగా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. సినిమాకు రెస్పాన్స్ కూడా బాగానే ఉండటంతో జనం ఆ సినిమా చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti sanon) సీతగా, సైఫ్ ఆలీఖాన్(saif ali khan) రావణాసుడిగా నటించిన ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్(Om Raut) చక్కగా తీర్చిదిద్దారు. ఇంతకీ ఎవరీ ఓం రౌత్..?
ఇప్పుడు అందరి చూపు ఆదిపురుష్(Adipurush) మీదే ఉంది. పక్షం రోజులుగా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. సినిమాకు రెస్పాన్స్ కూడా బాగానే ఉండటంతో జనం ఆ సినిమా చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti sanon) సీతగా, సైఫ్ ఆలీఖాన్(saif ali khan) రావణాసుడిగా నటించిన ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్(Om Raut) చక్కగా తీర్చిదిద్దారు. ఇంతకీ ఎవరీ ఓం రౌత్..? ఎక్కడ నుంచి వచ్చాడు? ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశాడు? ఈయన వివరాల కోసం నెటిజన్లు గూగుల్‌ను తెగ సెర్చ్ చేస్తున్నారు.
నిజానికి ఓం రౌత్‌ది సినిమా ఫ్యామిలీనే! ముంబాయిలో పుట్టిన ఓం రౌత్ తల్లి నీనా టెలివిజన్ ప్రొడ్యూసర్(NINA Television Producer). తండ్రి భరత్‌కుమార్(Bharath Kumar) ఓ జర్నలిస్టు(Journalist).. రాజ్యసభ సభ్యుడు కూడా! ఓం రౌత్ తాత సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కాడడంతో చిన్నప్పట్నుంచే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తితోనే చిన్నప్పుడు కొన్ని సినిమాల్లో నటించాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు నాటకాలు గట్రాలు వేశాడు. అనేక నాటక పోటీల్లో పాల్గొన్నాడు. అదే స్ఫూర్తితో కారమతి కోట్(Karamati quote) అనే సినిమాలో హీరోగా వేశాడు.
ఆ సినిమాలో ఇర్ఫాన్‌ఖాన్(Irfan Khan) కూడా ఓ ప్రధాన పాత్రను పోషించాడు. మరాఠీలో లోకమాన్య : ఏక్ యుగ్‌పురుష్(Ek Yugpurush) అనే సినిమాను రూపొందించాడు. దర్శకుడిగా ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ సినిమాను నీనా రౌత్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఓం రౌత్, ఆయన తల్లి నీనాలు కలిసి నిర్మించారు. ఇది ఓం రౌత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్(Filfare) అవార్డు కూడా లభించింది. ఈ విషయం అలా ఉంచితే, టీ సిరీస్ సంస్థతో ప్రభాస్‌కు మంచి అనుబంధం ఉంద.
సాహో(saho), రాధేశ్యామ్(Radheshyam) సినిమాలప్పుడు టీ సిరీస్‌లో(T-Series) ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారు ప్రభాస్. అప్పటికే అదే సంస్థలో ఉన్నారు. రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా(Ramayana: The Legend Of Prince Rama) అనే జపానీ సినిమా ఓం రౌత్‌కు బాగా నచ్చింది. జపాన్ భాషలో తీసిన సినిమానే అయినప్పటికీ హిందూ పురాణ గాధ రామాయణం ఆధారంఆనే రూపొందించారు.
1992లో జపాన్‌లో విడుదలైన ఈ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన ఓం రౌత్ ఓ చక్కటి స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇప్పటి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని రామాయణ గాధను మళ్లీ ఎందుకు తీయకూడదనే ఆలోచన వచ్చింది ఆయనకు! ఇదే విషయాన్ని టీ సిరీస్ సంస్థ ప్రతినిధులకు చెప్పాడు. వారు కూడా ఓకే అనేశారు. అలా ఆదిపురుష్ సినిమాకు అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత టీ సిరీస్ వల్ల ప్రభాస్‌కు ఓం రౌత్ పరిచయం అయ్యాడు. ఇప్పటి వరకు మూడు సినిమాలు తీసిన ఓం రౌత్‌కు పరాజయం అన్నది ఎదురుకాకపోవడం గమనార్హం.