పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఓజీ(OG Movie).. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ స్టయిలిష్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఓజీ(OG Movie).. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ స్టయిలిష్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే అదే టైటిల్ను సినిమాకు ఖరారు చేయబోతున్నారని అంటున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను మేకర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. సెప్టెంబర్‌ 2వ తేదీన ఒక ఆసక్తికరమైన వార్తను చెప్పబోతున్నామని ప్రకటించారు. ఆ రోజు పవన్‌కల్యాణ్‌ బర్త్‌డే కావడంతో టీజర్‌ను రిలీజ్‌ చేస్తారని అభిమానులు అనుకుంటున్నారు. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్య కథాంశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తుననారు. ప్రకాశ్‌రాజ్‌, అర్జున్‌దాస్‌, ఇమ్రాన్‌ హష్మీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Updated On 11 Aug 2023 7:43 AM GMT
Ehatv

Ehatv

Next Story