క్రియేటివ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని (Technology) రూపొందించారు. అసాధ్యమనుకున్న వాటిని దీనితో సుసాధ్యం చేసే టెక్నాలజీ దీని సొంతం. చనిపోయిన నటుడి (Expired Artist)ని కూడా తెరపై చూపించే టెక్నాలజీ డీప్‌ఫేక్‌ సొంతం. డబ్బింగ్‌ (Dubbing) లేకుండా కూడా ఆ నటుడి స్వరాన్ని యథాతథంగా డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సాయంతో మార్చే అవకాశం ఉంది.

అయితే ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసేందుకు కొన్ని అరాచకశక్తులు కాచుకొని కూర్చుంటాయి. సెలబ్రిటీల (Celebrities) నుంచి సామన్యుల వరకు ఈ డీప్‌ఫేక్ బారిన పడి కొత్త కష్టాలబారిన పడుతున్నారు. హీరోయిన్లు రష్మిక (Rashimika), కాజోల్ (Kazol) సహా ఎందరో ఈ డీప్‌ఫేక్ బారిన పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి హైదరాద్‌లో చోటుచేసుకుంది. డీప్‌ఫేక్‌ను తన అస్త్రంగా మలుచుకున్నాడు మనీష్ (Manish) అనే కేటుగాడు. డీప్‌ఫేక్‌తో యువతుల (Girls) నగ్న వీడియోలను తయారుచేస్తున్నాడు. ఆ వీడియోలను సంబంధిత యువతులకు పంపించి బ్లాక్‌మెయిల్‌కు (Black Mailing) పాల్పడుతున్నాడు. అంతేకాదు డబ్బులు ఇవ్వకుంటే ఈ వీడియోలను పోర్న్‌సైట్లలో (Porn Sites) ఉంచుతానని బెదిరిస్తున్నాడు. దీంతో భాయందోళనకు గురైన పలువురు బాధితులు సైబర్‌ క్రైమ్‌కు (Cyber Crime) ఫిర్యాదు చేయగా మనీష్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

Updated On 15 Dec 2023 4:17 AM GMT
Ehatv

Ehatv

Next Story