తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ పేరు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే సినిమాలు ఆడుకాలమ్, విసరనయ్, వడ చెన్నయ్, అసురన్. వెట్రిమారన్ సినిమాలంటే తమిళియన్స్యే కాదు.. మన తెలుగు వాళ్లకూ మంచి క్రేజ్ ఎందుకంటే ఆయన మూవీస్ ఆ రేంజ్ లో ఉంటాయి మరి. సమాజంలో జరిగే విషయాలను కథగా మార్చి ఆడియన్స్ కి హై ఇచ్చే విధంగా నేరేట్ చేయడంతో డైరెక్టర్ వెట్రిమారన్ దిట్ట. విసరనై లాంటి చిన్న మూవీని ఆస్కార్ రేంజ్ తీసుకెళ్లాడంటే వెట్రిమారన్ […]
తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ పేరు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే సినిమాలు ఆడుకాలమ్, విసరనయ్, వడ చెన్నయ్, అసురన్. వెట్రిమారన్ సినిమాలంటే తమిళియన్స్యే కాదు.. మన తెలుగు వాళ్లకూ మంచి క్రేజ్ ఎందుకంటే ఆయన మూవీస్ ఆ రేంజ్ లో ఉంటాయి మరి. సమాజంలో జరిగే విషయాలను కథగా మార్చి ఆడియన్స్ కి హై ఇచ్చే విధంగా నేరేట్ చేయడంతో డైరెక్టర్ వెట్రిమారన్ దిట్ట. విసరనై లాంటి చిన్న మూవీని ఆస్కార్ రేంజ్ తీసుకెళ్లాడంటే వెట్రిమారన్ మేకింగ్ స్టైల్ ఏంటో చెప్పక్కర్లేదు.
అయితే వెట్రిమారన్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ రాబోతుందని గత రేండేళ్లుగా టాక్ నడుస్తూనే ఉంది. కొరటాల శివ, ప్రశాంత నీల్ సినిమాల తర్వాత వెట్రిమారన్ తో మూవీ చేయనున్నారని న్యూస్ చాలా వచ్చాయి. ఎన్టీఆర్ తో మూవీ చేయాలని వెట్రిమారన్ మూడు కథలు వినిపించారని సమాచారం. ఆ మూడు కథల్లో తారక్ ఒక కథను సెలెక్ట్ చేసుకున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. వెట్రిమారన్ తీయబోయే సినిమాలో ధనుష్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ గా ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ న్యూస్ పై తమిళియన్స్ కూడా అవుననే అంటున్నారు.
వీరిద్దరి కాంబోలొ వస్తున్న మూవీ టూ పార్ట్స్ ఉంటుందని.. ఫస్ట్ పార్ట్ మూవీ మొత్తం ఎన్టీఆర్ తో కొనసాగుతుందని, ఇక సెకండ్ పార్ట్ మొత్తం కూడా ధనుష్ తో ఉంటుందనే పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే వెట్రిమారన్ ప్రస్తుతం సూర్యతో ‘వడి వాసల్’ అనే సిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తవ్వగానే ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఎన్టీఆర్ తో సినిమా చేయాలని తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ గత రెండేళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. అయితే ఎన్టీఆర్ డేట్స్ లేకపోవడంతో ఓకే చెప్పలేదు. ఎన్టీఆర్-ధనుష్ మల్టీస్టారర్ గా వెట్రిమారన్ డైరెక్షన్ సినిమాపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఒకవేళ ఆ కాంబో నిజమైతే సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది.