ట్రిపులార్(RRR) సినిమా ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్‌లను(Ram Charan) ఇంటర్నేషనల్ ఫేమ్‌ను చేసింది. ప్రస్తుతం వీరిద్దరు బిజీగా ఉన్నారు. ఆర్‌సి 15 షూటింగ్‌లో రామ్‌చరణ్ బీజీగా ఉంటే, కొరిటాల శివ(Koratala Shiva) డైరెక్షన్‌లో

Jr.NTR in Hrithik Roshan Flim
ట్రిపులార్(RRR) సినిమా ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్‌లను(Ram Charan) ఇంటర్నేషనల్ ఫేమ్‌ను చేసింది. ప్రస్తుతం వీరిద్దరు బిజీగా ఉన్నారు. ఆర్‌సి 15 షూటింగ్‌లో రామ్‌చరణ్ బీజీగా ఉంటే, కొరిటాల శివ(Koratala Shiva) డైరెక్షన్‌లో వస్తున్న మూవీపై ఎన్టీఆర్ కాన్‌సంట్రేషన్ చేశారు. మొన్నీమధ్యనే సెట్‌లోకి వెళ్లిందీ సినిమా. ఇప్పుడు తారక్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో(Hrithik Roshan)కలిసి ఎన్టీఆర్(NTR) స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడట. హృతిక్ రోషన్(Hrithik Roshan), టైగర్ ష్రాఫ్(Tiger Shroff) ముఖ్య పాత్రల్లో వచ్చిన వార్ చిత్రం ఘన విజయం సాధించింది. 2019లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే యశ్‌రాజ్ ఫిలింస్(Yash Raj Films) ప్రకటించింది. కానీ వివిధ కారణాలతో ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఇప్పుడు వార్-2కు ముహూర్తం ఖరారయ్యింది. వార్ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) దర్శకత్వం వహిస్తే, వార్-2ను అయాన్ ముఖర్జీ(Ayan Mukerjee) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలిపాడు. దీనిపై ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కానీ, ఈ వార్త మాత్రం అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. నిజానికి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌ను చాలా రోజుల కిందటే ఫైనలైజ్ చేశారట. బ్రహ్మాస్త్ర సినిమా విడుదల సమయంలో తెలుగు ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నప్పుడే టాక్స్ జరిగాయట. అప్పుడే వార్-2లో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
