చాన్నాళ్లుగా ఎన్టీఆర్ అభిమానులు(NTR Fans) ఎదురుచూస్తున్న పండుగ వచ్చేసింది. యంగ్ టైగర్ కొత్త సినిమా(NTR New Movie) మొదలయ్యింది. ట్రిపులార్(RRR) తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచానాలు ఆకాశాన్ని అంటాయి. కొరటాల శివ(Koratala Shiva) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలు హైదరాబాద్(Hyderabad)లోని ఓ స్టార్ హోటల్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన రాజమళి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ప్రశాంత్ నీల్, ప్రకాశ్‌రాజ్, సంగీత దర్శకుడు అనిరుద్ధ రవిచంద్రన్(Aniruddha Ravichandran), కల్యాణ్‌రామ్(Kalyan Ram)లు కూడా ముహూర్తపు వేడుకకు హాజరయ్యారు. జనతా గ్యారేజ్(Janatha Garage) తర్వాత తారక్‌తో కలిసి మరోసారి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్ననని కొరటాల అన్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నామని కొరటాల తెలిపారు. తన కెరీర్లో ఇది బెస్ట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పారాయన!

Eha Today Top 5 Cinema News
-
- చాన్నాళ్లుగా ఎన్టీఆర్ అభిమానులు(NTR Fans) ఎదురుచూస్తున్న పండుగ వచ్చేసింది. యంగ్ టైగర్ కొత్త సినిమా(NTR New Movie) మొదలయ్యింది. ట్రిపులార్(RRR) తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచానాలు ఆకాశాన్ని అంటాయి. కొరటాల శివ(Koratala Shiva) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలు హైదరాబాద్(Hyderabad)లోని ఓ స్టార్ హోటల్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన రాజమళి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ప్రశాంత్ నీల్, ప్రకాశ్‌రాజ్, సంగీత దర్శకుడు అనిరుద్ధ రవిచంద్రన్(Aniruddha Ravichandran), కల్యాణ్‌రామ్(Kalyan Ram)లు కూడా ముహూర్తపు వేడుకకు హాజరయ్యారు. జనతా గ్యారేజ్(Janatha Garage) తర్వాత తారక్‌తో కలిసి మరోసారి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్ననని కొరటాల అన్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నామని కొరటాల తెలిపారు. తన కెరీర్లో ఇది బెస్ట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పారాయన!
-
- సమంత(Samantha)తో విడాకులు(Divorce) తీసుకున్న తర్వాత హీరో నాగ చైతన్య(Naga Chaitanya) ఎక్కువగా హోటల్స్‌లోనే ఉంటూ వచ్చాడు. ఇన్నాళ్లకు ఓ కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. ఉగాది పండుగ రోజున కొత్తింట్లోకి అడుగుపెట్టాడు. నాగార్జున ఇంటి దగ్గరలోనే ఓ స్థలం కొనుక్కున్న నాగ చైతన్యం తన అభిరుచికి తగినట్టుగా ఇంటిని నిర్మించుకున్నాడు. స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్ సహా ఈ విలాసవంతమైన భవనంలో అన్ని ఉన్నాయి. ఎలాంటి ఆర్భాటం లేకుండా గృహప్రవేశ కార్యక్రమం జరిగింది.
-
- సంయుక్త మీనన్(Samyuktha Menon) తెలుసుగా? అదేనండి భీమ్లా నాయక్(Bheemla Nayak)లో హీరోయిన్. బింబిసారా(Bimbisara)లో కూడా ఈ మాలయాళ ముద్దుగుమ్మ నటించింది. తాజాగా సాయి ధరమ్ తేజ(Sai Dharam Tej) హీరోగా వస్తున్న విరుపాక్ష(Virupaksha)లో నటిస్తోంది. లెటెస్ట్‌గా ఈ మూవీ మేకర్స్‌పై సంయుక్త మీనన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు మాటిచ్చి ఎందుకు మోసం చేశారంటూ విరూపాక్ష టీమ్‌పై మండిపడింది. తన కోపాన్ని ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. నా నిరాశను వ్యక్తం చేసే ముందు ఓ మాట చెబుతాను. విరూపాక్ష టీమ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మీతో కలిసి చేసిన ఈ ప్రయాణం నా కెప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె ట్వీట్‌తో పేర్కొన్నారు. కాకపోతే మూవీ మేకర్స్ తనను నిరుత్సాహపర్చడం భావ్యంకాదని, ఈ ఉగాది(Ugadi)కి తన పోస్టర్ రిలీజ్(Poster Release) చేస్తామని మాట ఇచ్చి ఎందుకు తప్పారని ప్రశ్నించింది. పోస్టర్ ఎక్కడా అంటూ నిలదీసింది. ఈ ట్వీట్‌పై నిర్మాణ సంస్థ వెంటనే స్పందించింది. సంయుక్తకు క్షమాపణలు తెలిపింది.
-
- లోకనాయకుడు కమల్‌హాసన్(Kamal Haasan)తో ఇప్పటి వరకు లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) నటించలేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth)తో మూడునాలుగు సినిమాల్లో నటించిన నయనతారకు కమల్‌తో నటించే అవకాశం రాలేదు. ఇప్పుడా ఛాన్స్ వచ్చింది. తన సొంత బ్యానర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై విఘ్నేశ్ శివన్(Vignesh Shivan) డైరెక్షన్లో ఓ సినిమా తీయడానికి కమల్ రెడీ అవుతున్నాడు. నిజానికి అజిత్ 62(Ajith 62)వ సినిమాను విఘ్నేశ్ డైరెక్ట్ చేయాల్సి ఉండింది. కాకపోతే లాస్ట్ మినిట్‌లో విఘ్నేశ్‌ను ఆ సినిమా నుంచి తొలగించారు. ఈ సమయంలో కమల్‌హాసన్ ఆయనకు అండగా నిలిచాడు. నయనతార హీరోయిన్గా ఓ లేడి ఓరియంటెడ్ సినిమాను విఘ్నేశ్ డైరెక్షన్లో కమల్ నిర్మించబోతున్నాడట! ఇందులో కమల్ కూడా నటిస్తారని టాక్!
-
- సంక్రాంతి(Pongal)కి వచ్చిన వీరసింహారెడ్డి(Veera Simha Reddy ) బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాలకృష్ణ(Balakriskna) ముందు ఎవరైనా బలాదూర్ అని నిరూపించింది. ఆ విజయోత్సాహంతో ఉన్న బాలకృష్ణ ఇప్పుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎన్బికె108(NB108) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్పీడందుకుంది. ఉగాది(Ugadi)పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి రెండు ఫస్ట్‌లుక్స్ విడుదల చేశారు. ఆ రెండు ప్రచార చిత్రాల్లో బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో.. గడ్డం, హ్యాండిల్ బార్ మీసాలతో స్టైలిష్‌గా కనిపించారు. ‘‘
