Sr NTR Birth Anniversary : విశ్వ విఖ్యాత, నటసార్వభౌముడికి ఘన నివాళులు
మహానటుడు, టీడీపీ(TDP) వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(Sr NTR) 101 జయంతి వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లో(NTR Ghat) బాలకృష్ణ(Balakrishna), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), కల్యాణ్‌రామ్(Kalyan Ram), పురంధేశ్వరి(Purandeswari) అంజలి ఘటించారు.
మహానటుడు, టీడీపీ(TDP) వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(Sr NTR) 101 జయంతి వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లో(NTR Ghat) బాలకృష్ణ(Balakrishna), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), కల్యాణ్‌రామ్(Kalyan Ram), పురంధేశ్వరి(Purandeswari) అంజలి ఘటించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ పొద్దునే ఓ ట్వీట్ చేశారు. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనుసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా అటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు జూనియర్. ఇక పార్టీ నాయకులతో కలిసి తండ్రికి నివాళులు అర్పించిన బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనమని, నవసరాలకు అలంకారమని అన్నారు. ఆ మహానుభావుడు నటకు విశ్వవిద్యాలయమని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నారని తెలిపారు. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని పేర్కొన్నారు.ఎన్టీఆర్ ఒక పేరు, ఒక వ్యక్తి కాదని.. ఆయనొక సంచలనమని కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నారని, రాజకీయాల్లోకి అడుగుపెట్టి నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు తెచ్చారని పురంధేశ్వరి తెలిపారు.