ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించిన రామ్‌చరణ్‌ వేగంగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు కానీ ఎన్టీఆర్‌ మాత్రం తొందరపడటం లేదు. ఎన్టీఆర్‌(Jr.NTR) అభిమానులు ఈ విషయంపైనే కొంత అసంతృప్తిగా ఉన్నారు. సరే ఈ సంగతి వదిలేస్తే దేవర సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించిన రామ్‌చరణ్‌ వేగంగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు కానీ ఎన్టీఆర్‌ మాత్రం తొందరపడటం లేదు. ఎన్టీఆర్‌(Jr.NTR) అభిమానులు ఈ విషయంపైనే కొంత అసంతృప్తిగా ఉన్నారు. సరే ఈ సంగతి వదిలేస్తే దేవర సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను కల్యాణ్‌రామ్‌, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో దేవరలోని(Devara) ఓ యాక్షన్‌ షెడ్యూల్(Action schedule) పూర్తయ్యింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ ఆగస్టు తొలివారంలో ప్రారంభం అవుతుందని, ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని సమాచారం. ఈ యాక్షన్‌ సన్నివేశం ఇంట్రవెల్‌ సమయంలో వస్తుందని విశ్వసనీయ సమాచారం. స్టంట్‌మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేయనున్నారట! అలాగే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన సైఫ్‌ అలీఖాన్‌, జాన్వీ కపూర్‌లతో పాటు కొందరు కీలక పాత్రధారులపై ఈ షెడ్యూల్‌లోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహలు చేస్తున్నారు కొరటాల శివ. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5వ తేదీన దేవర సినిమాను విడుదల చేయడానికి మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు.

Updated On 31 July 2023 2:56 AM GMT
Ehatv

Ehatv

Next Story