దేవర సాలిడ్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్..
![War 2 updates : వార్ 2 లో ఎన్టీఆర్ పాత్ర పేరేంటో తెలుసా..? War 2 updates : వార్ 2 లో ఎన్టీఆర్ పాత్ర పేరేంటో తెలుసా..?](https://www.ehatv.com/h-upload/2025/02/06/740676-08.webp)
దేవర సాలిడ్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇటు వార్ 2 షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. బాలీవుడ్ లో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న వార్ 2లో .. హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి సందడి చేయబోతున్నాడు తారక్(Tarak). బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ యాక్షన్ సీక్వెల్ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ పాత్రతో పాటు.. ఎన్టీఆర్(NTR) పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు క్యారెక్టర్లు పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ ఇద్దరు హీరోలు యాక్షన్ కింగ్ లు. అంతే కాదు డాన్స్ లో కూడా వీళ్ళను మించినవారు లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ తో డాన్స్ అంటే హృతిక్ కాస్త భయపడుతున్నాడు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో కూడా వెల్లడించాడు.
అలాగే హృతిక్ తో పలు ఎనర్జిటిక్ యాక్షన్ మరియు డాన్స్ సీక్వెన్స్ లు కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసినిమాకు సబంధించి చాలా వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా ఈసినిమాలో ఎన్టీఆర పాత్ర పేరు ఈ సినిమా నుంచి లీక్ అయ్యింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్(Virendra Raghunath) అనే పేరుతో పిలువబడతాడు అని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పవర్ఫుల్ నటుడికి మంచి స్క్రీన్ నేమ్ పడినట్టే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మిస్తుండగా.. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుకగా రిలీజ్ చేనయబోతున్నారు.
![ehatv ehatv](/images/authorplaceholder.jpg?type=1&v=2)