యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా.. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో NTR30 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఆ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ అందించారు మేకర్స్. ఎన్టీఆర్30 (NTR30) చిత్ర ఫస్ట్ లుక్‏‏తోపాటు టైటిల్‏ను ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు అంటే మే 20న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా.. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో NTR30 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఆ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ అందించారు మేకర్స్. ఎన్టీఆర్30 (NTR30) చిత్ర ఫస్ట్ లుక్‏‏తోపాటు టైటిల్‏ను ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు అంటే మే 20న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈసినిమాపై అంచనాలు ఇంకాస్త రెట్టింపయ్యాయి. కొరటాల శివ తీసుకున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్టుల్లో ఎన్టీఆర్30 ఒకటి.. కొన్నేళ్లుగా స్క్రిప్తును రెడీ చేసుకుని.. గత రెండు నెలల క్రితమే షూటింగ్‏ను ప్రారంభించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా తర్వాత ప్రశాంతీ నీల్ (Prashanth Neel) డైరెక్షన్‏లో ఓ సినిమా, ఆ తర్వాత వెట్రిమారన్ (Vetrimaaran) డైరెక్షన్‏లో ఓ సినిమా చేయబోతున్నారట మన యంగ్ టైగర్. ఇక ఎన్టీఆర్30 చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‏పై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్‏గా శ్రీకర్ ప్రసాద్ ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

Updated On 15 May 2023 7:34 AM GMT
Ehatv

Ehatv

Next Story