ఆర్ఆర్ఆర్(RRR) సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala siva)తో రెండోసారి సినిమా చేస్తున్నారు. ఇంతకమందు వీరిద్దరూ జనతా గ్యారేజీ (Janatha Garage) సినిమాతో కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. ఎన్టీఆర్‌తో ఇప్పుడు ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కొరటాల మంచి పట్టుదలతో ఉన్నాడు.

NTR30 New Poster
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala siva)తో రెండోసారి సినిమా చేస్తున్నారు. ఇంతకమందు వీరిద్దరూ జనతా గ్యారేజీ (Janatha Garage) సినిమాతో కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. ఎన్టీఆర్‌తో ఇప్పుడు ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కొరటాల మంచి పట్టుదలతో ఉన్నాడు. అయితే పక్కా ప్లానింగ్‌తో సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నాడు కొరటాల. తారక్ పుట్టిన రోజు సందర్భంగా మే 19న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ట్విటర్ వేదిక ద్వారా అనౌన్స్ మెంట్ ఇచ్చింది.
‘రక్తంతో రాసిన అతడి కథలతో సముద్రం మొత్తం నిండిపోయింది’అని ఇంగ్లిష్‌లో పోస్టర్‌పై రాసి ఉంది. ఈ పోస్టర్లు ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్లో ఉండబోతోందని మనకు అర్ధమవుతోంది. ఇక 19న రిలీవ్ కానున్న టైటిల్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ ఒకటి జరుగుతోంది. ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఎన్టీఆర్ 30 (NTR30)చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై హరికృష్ణ కె, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది.
