నవంబర్ మాసం తుఫానులే కాదు, ఇంకా చాలా చాలా నష్టాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు నవంబర్ ఫోబియా పట్టుకుంది.

నవంబర్ మాసం తుఫానులే కాదు, ఇంకా చాలా చాలా నష్టాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు నవంబర్ ఫోబియా పట్టుకుంది. నవంబర్‌లో విడుదలయ్యే సినిమాలు ఏవీ హిట్ కావనే సెంటిమెంట్ ఉంది. అందుకే పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడతారు. పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలను ధైర్యంగా రిలీజ్ చేస్తుంటారు. పోనీ అవైనా ఆడుతున్నాయా అంటే అదీ లేదు. లాస్టియర్‌లాగే ఈ ఏడాది నవంబర్ కూడా టాలీవుడ్‌కు అచ్చి రాలేదు. నవంబర్ మొదటి వారంలో పది సినిమాలు వచ్చాయి. ఇందులో నిఖిల్ హీరోగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా కూడా ఉంది. ఇది కూడా ఫ్లాప్ అయ్యింది. జితేందర్ రెడ్డి సినిమా కూడా అంతే! ప్రమోషన్ బాగా చేసినా కలెక్షన్లు రాలేదు. మంచు లక్ష్మి నటించిన ఆదిపర్వం, హెబ్బా పటేల్ నటించిన ధూంధాం సినిమాలు కూడా పరాజయం చవి చూశాయి. రెండో వారంలో రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. వరుణ్ సందేశ్ నటించిన మట్కా, సూర్య నటించిన కంగువా విడుదలయ్యాయి. రెండూ ఘోర పరాజయాలను చవి చూశాయి. మట్కా అయితే వరుణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. నవంబర్ మూడో వారంలో విశ్వక్‌సేన్, సత్యదేవ్, మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశ్వక్‌సేన్ హీరోగా మెకానిక్ రాకీ, సత్యదేవ్ నటించిన జీబ్రా సినిమాలు నవంబర్ 22వ తేదీన విడుదలయ్యాయి. మెకానిక్ రాకీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా ప్రేక్షకుల నిరాదరణకు గురయ్యింది. జీబ్రా సినిమా కూడా అంతే! అశోక్ గల్లా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా అయితే వచ్చినట్టు కూడా తెలియకుండానే వెళ్లిపోయింది. నవంబర్ లాస్ట్ వీక్‌లో మరో నాలుగైదు చిన్న సినిమాలు వచ్చాయి. రోటి కపడా రోమాన్స్ సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆడలేదు. మొత్తంగా ఈ నెలలో వచ్చిన 22 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది ప్రీ క్లయిమాక్స్ టాలీవుడ్‌కు అచ్చి రాలేదు. మరి డిసెంబర్ నెల ఎలా ఉంటుందో చూడాలి. ఈ నెలలోనే పుష్ప 2 సినిమా విడుదల కాబోతున్నది.
