North Carolina Telugu Heritage Week : గవర్నర్ రాయ్ కూపర్ మే 28 నుంచి జూన్ 3 వరకూ తేదీలను 'తెలుగు వారసత్వ వారం'గా ప్రకటించారు.
నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్(Roy Cooper).. మే 28 నుంచి జూన్ 3 వరకూ తేదీలను 'తెలుగు వారసత్వ వారం'గా ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ రాయ్ కూపర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాభివృద్ధికి విభిన్న రంగాలలో తెలుగు వారు చేసిన అపారమైన కృషికి తెలుగు సంస్కృతిని, తెలుగు సమాజాన్ని గౌరవిస్తున్నట్లు ఆయన ప్రకటనలో వెల్లడించారు.

భారతీయ సాంస్కృతిక, జనాభా, భాషా వైవిధ్యానికి.. తెలుగు సంప్రదాయ సహకారం అపారమైనది. తెలుగు పురాతనమైన భారతీయ భాషలలో ఒకటి. తెలుగు సాహిత్యం, ప్రత్యేకమైన శబ్దవ్యుత్పత్తి, 400 B.C.E నాటి శాసనాలు, నిర్మాణాలు ఎంతో ప్రసిద్ధి గాంచాయని ప్రకటనలో కొనియాడారు.
ఉత్తర కరోలినా(North Carolina) రాష్ట్రం ఎన్నో తెలుగు మాట్లాడే కుటుంబాలకు నిలయం. భారతీయ వారసత్వం, సంస్కృతిని పరిరక్షించడంలో, సుసంపన్నం చేయడంలో తెలుగువారు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రకటనలో కొనియాడారు. కారీలోని నార్త్ కరోలినాలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఉత్తర అమెరికాలోనే ఎత్తైన హిందూ దేవాలయ నిర్మాణాన్ని నిర్మించే ప్రయత్నానికి తెలుగు సంఘం నాయకత్వం వహించిందని ప్రకటనలో వెల్లడించారు.
తెలుగు చలనచిత్రాలు, రాజకీయాలు, సంస్కృతిపై విశిష్టమైన ముద్ర వేసిన వ్యక్తిగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(Sr.NTR) గురించి ప్రకటనలో ప్రస్తావించారు. మే 28న ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని నార్త్ కరోలినా తెలుగు సంఘం జూన్ 3, 2023న సమావేశమవుతుంది. ఆయన వందేళ్ల ప్రస్థానానికి సంబంధించిన వేడుకలను తెలుగు వారు గర్వించే విధంగా జరుపుకోవాలని.. తెలుగు వారసత్వాన్ని, సంస్కృతిని ప్రదర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు.