బాలకృష్ణ(Balakrishna) కథానాయకుడిగా రూపొందుతున్న భగవంత్‌ కేసరి(Bhagavanth Kesari) సినిమా కోసం ఆయన ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని గణపతి బప్పా మోరియా పాట ఇప్పటికే విడుదలయ్యింది. అభిమానుల్లో జోష్‌ను నింపింది. యూ ట్యూబ్‌లో ఈ పాట దూసుకుపోతున్నది.

బాలకృష్ణ(Balakrishna) కథానాయకుడిగా రూపొందుతున్న భగవంత్‌ కేసరి(Bhagavanth Kesari) సినిమా కోసం ఆయన ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని గణపతి బప్పా మోరియా పాట ఇప్పటికే విడుదలయ్యింది. అభిమానుల్లో జోష్‌ను నింపింది. యూ ట్యూబ్‌లో ఈ పాట దూసుకుపోతున్నది. రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వదంతులకు చిత్రబృందం జవాబు ఇచ్చుకుంది. తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదల చేస్తామని గతంలో చిత్ర బృందం ప్రకటించింది. అయితే తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా సినిమా విడుదల వాయిదా పడనుందని సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనికి చిత్ర యూనిట్‌ ఓ క్లారిటీ ఇచ్చింది. లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన ఓ పోస్టర్‌లో రిలీజ్‌ డేట్‌ అక్టోబర్‌ 19 అని ఉంది. ఇది చూసి ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో చిత్రీకరణ పూర్తి అవుతుంది. ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అఖండ, వీరసింహారెడ్డిలతో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ విజయాలను అందుకున్న బాలకృష్ణ హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశారు. ఇప్పటికే భగవంత్‌ కేసరి టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. లేటెస్ట్‌గా విడుదల చేసిన పాట కూడా లక్షల వ్యూవ్స్‌తో యూ ట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated On 18 Sep 2023 2:41 AM GMT
Ehatv

Ehatv

Next Story