మలయాళ నటి నిత్యామీనన్‌(Nithya Menon) తెలుగువారికి కూడా పరిచయమే! బాలనటిగా సినీ రంగంలో అడుగుపెట్టిన నిత్యామీనన్‌ 2006లో హీరోయిన్‌ అయ్యారు. అది కూడా ఓ కన్నడ సినిమాలో కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మలయాళంలో నటించారు. తమిళం, తెలుగులో కూడా నటిస్తూ బహుభాష నటిగా గుర్తింపు పొందారు నిత్యా మీనన్‌. ఆమె గొప్ప సింగర్‌ కూడా! కాకపోతే ఇప్పుడు ఆమెకు అంతగా సినిమా అవకాశాలు లేవు.

మలయాళ నటి నిత్యామీనన్‌(Nithya Menon) తెలుగువారికి కూడా పరిచయమే! బాలనటిగా సినీ రంగంలో అడుగుపెట్టిన నిత్యామీనన్‌ 2006లో హీరోయిన్‌ అయ్యారు. అది కూడా ఓ కన్నడ సినిమాలో కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మలయాళంలో నటించారు. తమిళం, తెలుగులో కూడా నటిస్తూ బహుభాష నటిగా గుర్తింపు పొందారు నిత్యా మీనన్‌. ఆమె గొప్ప సింగర్‌ కూడా! కాకపోతే ఇప్పుడు ఆమెకు అంతగా సినిమా అవకాశాలు లేవు. చేసింది చాలు ఇక పెళ్లి చేసుకోమని కుటుంబసభ్యులు బలవంతం చేస్తున్నారట! అంతే కాకుండా తనకు 35 ఏళ్ల వచ్చాయని , ఇక పెళ్లి చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారట. దీంతో నిత్యామీనన్‌ తన చిన్ననాటి స్నేహితుడైన ఓ మలయాళ స్టార్‌ హీరోను పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా నిత్యామీనన్‌ పెళ్లి విషయంపై చాలా వార్తలు వచ్చాయి. అలాంటి వార్తలు వచ్చిన ప్రతీసారి వాటిని ఖండించేవారు నిత్యామీనన్‌. కానీ ఈసారి మలయాళీ ఇండస్ట్రీలో మాత్రం నిత్యామీనన్ పెళ్లి వార్త బాగానే వైరల్‌ అవుతోంది. అంతే కాకుండా అక్కడి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఇది నిజమేనని అంటున్నారు! పెళ్లి మాత్రం ప్రముఖ హీరోతోనే జరుగుతుందంటున్న నిత్యామీనన్‌ పేరు మాత్రం చెప్పడం లేదు. గతంలో తన పెళ్లి విషయంపై చిన్న వార్త కనిపించినా వెంటనే రియక్టయ్యే నిత్యా మీనన్‌ ఇప్పుడు మాత్రం స్పందించడం లేదు. దీన్ని బట్టి పెళ్లి వార్త నిజమే అయి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

Updated On 23 Aug 2023 8:03 AM GMT
Ehatv

Ehatv

Next Story