సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యమీనన్(Nitya menon) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కెరీర్ లో ఎవరితో ఒక్క మాట అనిపించుకోలేదు కాని.. ఆమె మాత్రం తనను అసలు హీరోయిన్ గానే చూడదంటూ... తన మనసులో మాట వెల్లడించింది నిత్య. ఇంతకీ ఎవరామె..?
సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యమీనన్(Nitya menon) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కెరీర్ లో ఎవరితో ఒక్క మాట అనిపించుకోలేదు కాని.. ఆమె మాత్రం తనను అసలు హీరోయిన్ గానే చూడదంటూ... తన మనసులో మాట వెల్లడించింది నిత్య. ఇంతకీ ఎవరామె..?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమర్షియల్ హంగులకు దూరంగా.. మంచి సినిమాలు మాత్రయే చేసుకుంటూ.. ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉండే హీరోయిన్లలో నిత్య మీనన్(Nitya menon) కూడా ఒకరు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నిత్య. అందులో నిత్యమీనన్ రూటు సపరేటు. ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి..కెరీర్ బిగినింగ్ నుంచి తను అనున్నది అనుకున్న్నట్టు చేయడం ఆమెకు అలవాటు. తాను పెట్టుకున్న రూల్స్ ప్రకారమే సినిమాలు చేస్తుంది నిత్య. గీత దాటకుండా.. హీరోయిన్ గా మంచి పేరు తెచ్చకుంది మలయాళ బ్యూటీ.
నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకోని వరుస హిట్స్ తో దూసుకుపోతుంది నిత్యమీనన్. గ్లామర్ రోల్స్ చేస్తే కోట్లు ఇస్తామన్నా ఆమె టెమ్ట్ అవ్వలేదు.. నటనను మాత్రమే నమ్ముకుంది నిత్య.
ఈమధ్య కాస్త నిత్యామీనన్ జోరు తగ్గించింది. తక్కువ సినిమాలు చేసినా. .మంచి సినిమాలు గుర్తుండిపోయే సినిమాలు చేస్తుంది. తాజాగా ఆమె శ్రీమతి కుమారి(Srimathi kumari) అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సాధించింది. దీనికి సబంధించిన కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది నిత్యా మీనన్. అందులో తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా పెళ్లి గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన పేరెంట్స్ తనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని తెలిపింది. తన పెళ్లి విషయంలోనూ ఎప్పుడూ వారు ఒత్తిడి తీసుకురాకుండా చాలా సపోర్టివ్ గా ఉన్నారని చెప్పింది. తన ఇంట్లో కాని.. బయట కానీ తనపై ప్రెజర్ తెచ్చేవారు ఎవరూ లేరు కాని.. తన బామ్మ మాత్రం తనను హీరోయిన్ గా చూడదన్నారు. తనకు వాల్యూ ఇవ్వకుండా మాటలతో టార్చర్ పెట్టేదన్నారు నిత్య. సూటి పోటి మాటలతో ఇబ్బంది పెట్టేదట. ఇన్నేళ్ల వయసు వచ్చింది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ వేధించుకుని తినేదట భామ్మ. కనీసం తననో నటిగా కూడా గుర్తించేది కాదట. నువ్వేం చేస్తున్నావ్.. ఇంత వరకూ నువ్వు జీవితంలో సాధించిందేమిటి..? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావ్.. త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా.. అంటూ .. మాటలతో ఫ్రై చేసేసేదట.