అలనాటి అందాల హీరోయిన్లలో కొందరు లేటు వయసులో రీ ఎంట్రీ ఇస్తుంటారు. ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా రాణించిన వారు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పుడు వారికి బోల్డంత తీరిక ఉంటుంది కాబట్టి అవకాశం వస్తే మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విధంగా ఇప్పటికే చాలా మంది స్టార్‌ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చారు.

అలనాటి అందాల హీరోయిన్లలో కొందరు లేటు వయసులో రీ ఎంట్రీ ఇస్తుంటారు. ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా రాణించిన వారు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పుడు వారికి బోల్డంత తీరిక ఉంటుంది కాబట్టి అవకాశం వస్తే మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విధంగా ఇప్పటికే చాలా మంది స్టార్‌ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పుడా లిస్టులో మరో మాజీ హీరోయిన్‌ చేరబోతున్నారు. మీరు అర్చన గుర్తున్నారు కదా! భానుచందర్‌ హీరోగా వచ్చిన రొమాంటిక్‌ సినిమా నిరీక్షణలో(Nirikshna) హీరోయిన్‌గా నటించింది ఈమెనే! 1980లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అర్చన తర్వాత తెలుగుతో పాటు మలయాళం, హిందీ భాషల్లోనూ నటించారు. మీనాక్షి పొన్నుంగా(Meenakshi Ponnunga) అనే తమిళ టీవీ సీరియల్‌లోనూ కనిపించారు. మధురగీతం సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన అర్చన తర్వాత లేడిస్‌ టైలర్‌, దాసి, ఉక్కు సంకెళ్లు, మట్టి మనుషులు, భారత్‌బంద్‌, పచ్చ తోరణం వంటి అనేక చిత్రాలలో నటించారు. నిరీక్షణ సినిమాలో గిరిజన యువతిగా ఆమె కనబర్చిన నటన అద్భుతం. అందుకే ఈ సినిమాకు నంది అవార్డు లభించింది. వీడు అనే సినిమాకు జాతీయ అవార్డుతో పాటు ఫిలింఫేర్‌ అవార్డు కూడా వచ్చింది. బి.నరసింగరావు రూపొందించిన దాసి సినిమాకు మరోసారి జాతీయ ఉత్తమనటిగా అవార్డు దక్కింది. కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న అర్చన మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం ఆమె షష్టిపూర్తి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అప్పడే ఈ విషయం బయటకు వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత అర్చన మళ్లీ నటిస్తుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌(Rajendra Prasda), అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరోగా రూపేష్‌ కుమార్‌ చౌదరి నటిస్తుండంతో పాటు సినిమాను నిర్మిస్తున్నారు కూడా! ఆయనకు జంటగా ఆకాంక్షా సింగ్‌ నటిస్తున్నారు. పవన్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు.

Updated On 1 Aug 2023 4:51 AM GMT
Ehatv

Ehatv

Next Story