నిక్కీ తంబోలి(Nikki Tamboli).. ఈ బాలీవుడ్ భామ బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు. అన్నట్టు తెలుగు ప్రేక్షకులకు కూడా నిక్కీ తంబోలి పరిచయమే! చీకటి గదిలో చితక్కొట్టుడు(Chikati Gadhilo chithakottudu) అనే సినిమాతో ఆమె తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంచన-3(Kanchana-3) సినిమా ద్వారా కోలీవుడ్‌లో కూడా ప్రవేశించారు.
నిక్కీ తంబోలి(Nikki Tamboli).. ఈ బాలీవుడ్ భామ బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు. అన్నట్టు తెలుగు ప్రేక్షకులకు కూడా నిక్కీ తంబోలి పరిచయమే! చీకటి గదిలో చితక్కొట్టుడు(Chikati Gadhilo chithakottudu) అనే సినిమాతో ఆమె తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంచన-3(Kanchana-3) సినిమా ద్వారా కోలీవుడ్‌లో కూడా ప్రవేశించారు. అటు పిమ్మట టాలీవుడ్‌లో తిప్పరా మీసం(Thippara Misam), అంటే సుందరానికి(Ante Sundharaniki) అనే సినిమాలలో కనిపించారు. హిందీ బిగ్‌బాస్-14 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న నిక్కీ తంబోలి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటారు. కొన్నిసార్లు అయితే హాట్ వీడియోలతో రచ్చ చేస్తూ ఉంటారు నిక్కీ తంబోలి. లేటెస్ట్‌గా ఆమె షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు ఏకంగా పోర్న్ స్టార్(Porn Star) అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నిక్కీ తంబోలి తనపై ట్రోల్స్‌పై స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మీడియాలో ట్రోల్స్ తనకు కొత్తేమీ కాదన్నారు.
సోషల్ మీడియాలో(Social Media) తనపై వస్తున్న కామెంట్లను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. . 'మీరు నన్ను ఏలాగైనా పిలవండి. కానీ అవీ ఏ విధంగానూ నా స్థిరత్వ భావనను దెబ్బ తీయలేవు. సోషల్ మీడియాలో ట్రోల్ కోసమే సమయాన్ని వెచ్చించడమే పనిగా పెట్టుకున్న వ్యక్తుల ధ్రువీకరణ కోసం నేను ఇక్కడికి రాలేదు. నాతో పాటు మరెవరినైనా అడల్ట్ ఫిల్మ్ స్టార్‌తో పోల్చడమంటే మహిళలను అవమానించడమే కదా! కారణం లేకుండా మరో మహిళను కించపరచడం ఎందుకు? ఇలాంటి చిత్రాలను కేవలం కామ దృష్టితో ఆస్వాదించే భయంకరమైన వ్యక్తులంతా మీరే కదా? అడల్ట్ ఫిల్మ్ స్టార్ అయినప్పటికీ మానవతా విషయానికొస్తే గౌరవానికి అర్హులే కదా. మనం ఎంత స్పందిస్తే..మనపై ఇంకా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు. అందుకే వాటిని పట్టించుకోను. ఏదో ఒకరోజు వారే విసుగు చెంది కామెంట్స్ చేయడం మానేస్తారు. అంతే తప్ప అవీ నా జీవితాన్ని ఎలాంటి ప్రభావితం చేయలేవు.' అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చుకున్నారు నిక్కీ తంబోలి. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు కూడా ఆమె ట్రోలింగ్‌కు గురయ్యారు. నిక్కీ తంబోలి బిగ్ బాస్‌తో పాటు.. ఖత్రోన్ కే ఖిలాడి -11 సీజన్‌లో పాల్గొన్నారు. అంతే కాకుండా అనేక మ్యూజిక్ వీడియోలు చేశారు.