హీరో నిఖిల్ సిద్ధార్థ్ సినిమా సినిమాకి తన మార్కెట్ రీచ్ ను పెంచుకుంటున్నాడు. కార్తికేయ 2 నిఖిల్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్. ఈ సినిమా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కార్తికేయ 2 విజయం.. నిఖిల్‌ తదుపరి చిత్రం నాన్-థియేట్రికల్‌ బిజినెస్

హీరో నిఖిల్ సిద్ధార్థ్ సినిమా సినిమాకి తన మార్కెట్ రీచ్ ను పెంచుకుంటున్నాడు. కార్తికేయ 2 నిఖిల్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్. ఈ సినిమా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కార్తికేయ 2 విజయం.. నిఖిల్‌ తదుపరి చిత్రం నాన్-థియేట్రికల్‌ బిజినెస్ రికార్డ్ స్థాయిలో అవ‌డానికి సాయ‌ప‌డింది. నిఖిల్ తన తదుపరి చిత్రం 'స్పై'(SPY) ను పాన్ ఇండియన్ స్థాయిలో విడుదల చేయబోతున్నాడు. ఈ సినిమా యూనివర్సల్ అప్పీల్ కలిగి ఉంటుందని అంటున్నారు.

ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ 'స్పై'(SPY) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్‌తేజ్ ఉప్పలపాటి సీఈవోగా ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. రాజశేఖర్ రెడ్డి భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణ‌ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నారు. ప్ర‌చార చిత్రాల‌తో ఈ చిత్రానికి విప‌రీత‌మైన‌ బజ్ ఏర్ప‌డింది.

ఎంత‌లా అంటే.. 'స్పై'(SPY) సినిమా నాన్-థియేట్రికల్ హక్కులను అమెజాన్, స్టార్ నెట్‌వర్క్ లు రూ. 40 కోట్లకు పొందాయి. ఇంత‌కుముందు నిఖిల్ నటించిన ఏ చిత్రం ఇంత ధ‌ర‌కు అమ్ముడు పోక‌పోవ‌డం విశేషం. ఇదే అత్యధికం. ఈ విష‌యాన్ని పీఆర్ కన్సల్టెంట్ వంశీ కాక ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. కాగ‌, యువ‌ హీరోల సినిమాల‌కు ఈ స్థాయి ధ‌ర ద‌క్కడం కూడా ఒక‌ రికార్డుగా చెబుతున్నారు.

డిజిటల్, శాటిలైట్ భాగస్వాములు కొన్ని 'స్పై'(SPY) రష్‌లను చూశారు. అవుట్‌పుట్‌కు చాలా ఆకర్షితుల‌య్యార‌ని టాక్ న‌డుస్తోంది. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు మకరంద్ దేశ్‌పాండే కూడా చిత్రంలో న‌టిస్తున్నాడు. యాక్షన్‌తో కూడిన ఈ స్పై థ్రిల్లర్‌కి నిర్మాత‌ కె రాజశేఖర్ రెడ్డి కథను కూడా అందించారు.

Updated On 7 April 2023 12:03 AM GMT
Yagnik

Yagnik

Next Story