సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇక సెలబ్రెటీల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. వారి గురించి సోషల్‌ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. వారి పర్సనల్‌ లైఫ్‌ గురించి అందరికీ ఆసక్తి ఉంటుంది.

సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇక సెలబ్రెటీల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. వారి గురించి సోషల్‌ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. వారి పర్సనల్‌ లైఫ్‌ గురించి అందరికీ ఆసక్తి ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందా అన్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది. లేటెస్ట్‌గా మెగా డాటర్‌ నిహారిక విడాకులు తీసుకున్న విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. నిహారిక- చైతన్యల వివాహం 2020 డిసెంబర్‌ 9వ తేదీన వైభవంగా జరిగింది. చాలా గొప్పగా ఈ పెళ్లిని జరిపించారు. అయితే వీరి దాంపత్యం ఎక్కువ కాలం కొనసాగలేదు. వివాహబంధం తెగిపోయింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు. పెళ్లయ్యాక కూడా నిహారిక తన కెరీర్‌ను పటిష్టపర్చుకునే ప్రయత్నాలు చేశారు. పెళ్లికి ముందు కొన్ని సినిమాలలో నటించిన నిహారిక పెళ్లి అయ్యాక నిర్మాతగా మారింది. ఈ మధ్యే సొంత బ్యానర్‌ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యాలయం ప్రారంభించింది. ఆ విధంగా చైతన్యకు దూరంగా ఉన్నా తను మాత్రం ఏదో ఒక సినిమా పనిలో బిజీగానే ఉండింది. అయితే నిహారిక విడాకుల విషయం బహిర్గతం అయ్యాక నిహారిక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెబుతుందని అందరూ అనుకున్నారు. కానీ నిహారిక మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఆమె విడాకులకు సంబంధించిన వార్తలు ప్రధాన మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో కూడా మారుమోగుతున్న సమయంలోనే తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె ఒకరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ స్టోరీ షేర్‌ చేసింది. అంటే విడాకుల విషయంలో ఆమె ఎలాంటి భావోద్వేగానికి లోనవ్వలేదన్నమాట! నిహారిక సినిమాలకు అమెరికా నుంచి ప్రమోషన్స్‌ చేస్తున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఆమె బర్త్‌డే విషెస్‌ చెప్పింది. విడాకుల వార్తల గురించి సోషల్‌ మీడియాలో పలు రకాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఆమె స్పందించకపోవడంతో విడిపోయిన విషయాన్ని నిహారిక లైట్ తీసుకున్నారని సోషల్‌ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Updated On 5 July 2023 12:48 AM GMT
Ehatv

Ehatv

Next Story