మెగా ఫ్యామిలీ నుంచి అరడజనకు పైగా హీరోలు రాగా హీరోయిన్‌గా మాత్రం నిహారికనే ఎంట్రీ ఇచ్చింది.

మెగా ఫ్యామిలీ నుంచి అరడజనకు పైగా హీరోలు రాగా హీరోయిన్‌గా మాత్రం నిహారికనే ఎంట్రీ ఇచ్చింది. తన యాంకరింగ్, నటనతో నిహారిక అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై మంచి గుర్తింపునే దక్కించుకుంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా పరిచయమైనా స్వతహాగా ఎదుగుతూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెండి తెర కంటే ముందుగా నిహారిక స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసింది. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ఢీ జూనియర్స్ ప్రోగ్రాంకు హోస్ట్‌గా పనిచేసింది. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే వెబ్ సిరీస్‌ చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సిరీస్‌తో నిహారికకు మంచి పేరు తెచ్చుకుంది. 8 ఏళ్ల కింద వచ్చిన 'ఒక మనసు' సినిమాతో ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో 'హ్యాపీ వెడ్డింగ్', 'తమిళంలో 'ఒరు నల్ల నాల్ పాతు సోల్‌రెన్' సినిమాలు చేసింది. ఈ రెండు కూడా నిరాశపర్చాయి. తాజాగా మెగా డాటర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఊపుతోంది. ప్రస్తుతం నిహారిక 'మద్రాస్ కారన్' అనే తమిళ సినిమా చేస్తుంది. కాగా.. ఈ సినిమా నుంచి తాజాగా కాదల్ సడుగుడు అనే వీడియో సాంగ్ రిలీజైంది. ఈ పాటలో నిహారిక ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. బెడ్‌రూం సీన్స్‌లో నటించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.


ehatv

ehatv

Next Story