సోషల్ మీడియాలో(social) వచ్చే వదంతులను అస్సలు పట్టించుకోనని, కామెంట్స్‌ను కూడా అస్సలు చూడనని అంటున్నారు మెగా డాటర్ నిహారిక(Niharika).
సోషల్ మీడియాలో(social) వచ్చే వదంతులను అస్సలు పట్టించుకోనని, కామెంట్స్‌ను కూడా అస్సలు చూడనని అంటున్నారు మెగా డాటర్ నిహారిక(Niharika). నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె కెమెరా ముందుకు వచ్చారు. ఈసారి సినిమా కాకుండా వెబ్ సిరీస్‌లో(Web series) నటించారు. నిహారిక ప్రధాన పాత్రలో నటించిన డెడ్ పిక్సెల్స్(Dead Pixels) వెబ్ సిరీస్ ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
తనను ట్రోల్స్ చేసే వాళ్ల గురించి స్పందిస్తూ పని పాటా లేనివాళ్లే ట్రోల్స్ చేస్తారని, అలాంటి వారి గురించి తాను పట్టించుకోనని అన్నారు. మనం అవసరం లేనివాళ్లకు అటెన్షన్ ఇస్తుంటామని, ప్రతి చోట ఇడియట్స్ ఉంటూనే ఉంటారని అన్నారు. వాళ్లను పట్టించుకుంటే ఆ వెధవలు మరింత రెచ్చిపోతారని చెప్పారు. తనకు ఇష్టమైన వాళ్లు ఉన్నారని, ఖాళీ సమయం దొరికితే వాళ్ల కోసం కేటాయిస్తానని నిహారిక అన్నారు. అంతేకానీ ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి తాను ఎందుకు పట్టించుకుంటా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో నాపై వచ్చే కామెంట్స్‌ను చూసేదానినని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని అన్నారు. దాని వల్ల మన ఆరోగ్యం పాడైపోతుందని, అందుకే సోషల్ మీడియా రూమర్స్ గురించి తాను పెద్దగా పట్టించుకోనని నిహారిక చెప్పుకొచ్చింది.