మెగా డాటర్ కొణిదెల నిహారిక (Niharika Konidela) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్‏గా కెరీర్ ప్రారంభించి ఆమె నటిగా మారి.. రాణించింది.. రాణిస్తుంది. ఆమె పెళ్లి తర్వాత నిర్మాతగా కూడా మారారు. నిహారిక (Niharika) ఇప్పటికే ఓ వెబ్ సిరీస్‏తోపాటు సినిమాలు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కానీ తాజాగా మెగా డాటర్ వార్తల్లోకెక్కింది. నిహారిక విడాకుల (Divorce) వార్త సోషల్ మీడియాలో వచ్చిన సంగతి విధితమే. 2020లో జొన్నలగడ్డ చైతన్య (Jonnalagadda Chaitanya)తో నిహారిక పెళ్లి జరిగింది. చాలా ఫ్రెండ్లీగా ఉండే ఈ జంట మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని వార్తలు వస్తున్నాయి.

మెగా డాటర్ కొణిదెల నిహారిక (Niharika Konidela) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్‏గా కెరీర్ ప్రారంభించి ఆమె నటిగా మారి.. రాణించింది.. రాణిస్తుంది. ఆమె పెళ్లి తర్వాత నిర్మాతగా కూడా మారారు. నిహారిక (Niharika) ఇప్పటికే ఓ వెబ్ సిరీస్‏తోపాటు సినిమాలు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే.

కానీ తాజాగా మెగా డాటర్ వార్తల్లోకెక్కింది. నిహారిక విడాకుల (Divorce) వార్త సోషల్ మీడియాలో వచ్చిన సంగతి విధితమే. 2020లో జొన్నలగడ్డ చైతన్య (Jonnalagadda Chaitanya)తో నిహారిక పెళ్లి జరిగింది. చాలా ఫ్రెండ్లీగా ఉండే ఈ జంట మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే నిహారిక (Niharika) మళ్లీ వార్తల్లోకెక్కింది. మామిడి కాయ తింటూ ఉన్న వీడియోను తన ఇన్‬‏స్టాగ్రామ్‏లో పోస్ట్ చేసింది. ఇంకేముందు మనవాళ్లు ఊరుకుంటారా.. నిహారిక నువ్వు ప్రెగ్నెంట్‏వా ? శుభ వార్త చెప్పబోతున్నావా ? అంటూ రకరకాలుగా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ నిహారిక ఏ మాత్రం రియాక్ట్ అవ్వ లేదు.

ఏది ఏమైనప్పటికీ మామిడి కాయ తింటున్న వీడియోతో నిహారిక మరోసారి నెటిజన్ల నోళ్లలో నానుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. మరోవైపు నిహారిక కొణిదెల వ్యక్తిగత జీవితం మాత్రం కాస్త గందరగోళంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. తన భర్త చైతన్య (Chaitanya)తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆమె ఏమాత్రం ఇష్టపడంలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే చైతన్య అయితే పెళ్లి ఫొటోలను కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‏ల నుంచి పూర్తిగా డిలీజ్ చేసేశాడు. ఈ బ్యూటీ ఫుల్ కపుల్స్ మధ్య ఏం జరిగిందనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఒకప్పుడు ఇద్దరూ ఔటింగ్స్, జిమ్‏కి కూడా కలిసి వెళ్లిన సందర్భాలను మనం చూశాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా నిహారిక ఒక్కతే కనిపిస్తోంది. చైతన్య ఎక్కడా కనిపించడం లేదు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజునాడు కూడా చైతన్య స్పందించలేదు. సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఒక్క బర్త్ డే పోస్టు కూడా పెట్టినట్టు కనిపించలేదు. ఇవన్నీ గమనిస్తుంటే శ్రీజ-కల్యాణ్ దేవ్ (Sreeja-Kalyan Dev) దారిలోనే నిహారిక-చైతన్యలు నడుస్తున్నట్టు అనిస్తోందని నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి క్లారిటీ ఒస్తే గాని వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పడనుంది.

Updated On 6 April 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story