నాగబాబు(Nagababu) కూతురు నిహారిక(Niharika) భర్తకు దూరంగా ఉంటున్నారన్న విషయం విస్పష్టం. ఇటీవల వరుణ్‌ తేజ్‌(Varun Tej) ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో నిహారిక కనిపించారే కానీ ఆమె భర్త చైతన్య(Chaitanya) ఎక్కడా కనిపించలేదు. వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ ఆ మధ్యన సోషల్‌ మీడియా(Social Media)లో వార్త చక్కర్లు కొట్టింది. కొన్ని వెబ్‌సైట్లు కూడా విడాకుల కథనాన్ని రాశాయి.

నాగబాబు(Nagababu) కూతురు నిహారిక(Niharika) భర్తకు దూరంగా ఉంటున్నారన్న విషయం విస్పష్టం. ఇటీవల వరుణ్‌ తేజ్‌(Varun Tej) ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో నిహారిక కనిపించారే కానీ ఆమె భర్త చైతన్య(Chaitanya) ఎక్కడా కనిపించలేదు. వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ ఆ మధ్యన సోషల్‌ మీడియా(Social Media)లో వార్త చక్కర్లు కొట్టింది. కొన్ని వెబ్‌సైట్లు కూడా విడాకుల కథనాన్ని రాశాయి. ఈ రకమైన వార్తలను అటు చైతన్య ఖండిచలేదు.. ఇటు నిహారిక కూడా కాదనలేదు. ఇప్పుడు చైతన్య తన ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముద్దపప్పు ఆవకాయ సిరీస్‌తో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన నిహారిక తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్‌ అయ్యారు. హ్యపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించారు. పెదనాన్న మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeeevi) నటించిన సైరాలో గెస్ట్‌ రోల్ వేశారు. 2020 డిసెంబర్‌లో జొన్నలగడ్డ చైతన్య(Chaitanya Jonnalagadda)ను పెళ్లి చేసుకున్నారు. ఓ రెండేళ్ల పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు. తర్వాత ఏమైందో ఏమో.. ఇద్దరూ ఎక్కడా కలిసి కనిపించడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తతో కలిసి ఉన్న ఫోటోలన్నింటినీ నిహారిక డిలీట్‌ చేశారు. బదులుగా చైతన్య కూడా అదే పని చేశారు. దీంతో వీరిద్దరు విడిపోయారన్నది రూఢీ అయ్యింది. నిహారిక మాత్రం సినిమాల్లో అడపాదడపా నటిస్తున్నారు. చైతన్య మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఫిబ్రవరి 15న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టిన చైతన్య .. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఓ పోస్ట్‌ పెట్టారు. ఆయన పెట్టిన ఫోటోలు చూస్తే ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర(Mharastra)లోని ఓ మెడిటేషన్ సెంటర్‌లో ఉన్నట్టు అర్థమవుతోంది. ఫోటోల కింద చైతన్య ఓ కామెంట్‌ పెట్టారు. ' నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. పది రోజులుగా నా జీవితంలోకి వచ్చిన విపాసన ప్రక్రియ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. మనం ఓ చోటుకి ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లి, అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది అలాంటిదే' అని రాశారు. ముంబయిలోని గ్లోబల్ విపాసన పగోడా అనేది ఓ మెడిటేషన్ సెంటర్. ప్రస్తుతం చైతన్య అక్కడే ఉన్నాడు. ఇదే విషయాన్ని బయటపెట్టాడు.

Updated On 1 July 2023 4:58 AM GMT
Ehatv

Ehatv

Next Story