ప్రముఖ నటి, సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు (Varalaxmi Sarathkumar) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సమన్లు జారీ చేసింది. కేరళ డ్రగ్స్ కేసులో భాగంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను విచారించేందుకు ఆమెకు ఎన్ఐఏ అధికారులు సమన్లు ఇచ్చారు. ఈ కేసులో వరలక్ష్మి మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించినట్లు సమాచారం.

కేరళలోని వియిన్యం సముద్ర తీరం వద్ద ఈనెల 18న భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు, మారణాయుధాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ విఘ్నేష్ అనే పేరుతో ఉన్న ఫిషింగ్ బోట్ నుంచి 300 కేజీల హెరాయిన్, ఒక ఏకే 47 రైఫిల్, 17 రౌండ్ల బుల్లెట్లు, ఐదు 9ఎంఎం పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన హెరాయిన్ విలువ రూ.2100 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో ఆదిలింగంతో పాటు మరో ఐదుగురు వ్యక్తులపై ఎన్ఐఏ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ డ్రగ్స్, ఆయుధాలను ఇరాన్ లేదంటే పాకిస్థాన్ నుంచి శ్రీలంక మీదుగా ఇండియాకు తీసుకొచ్చారని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు.