దసరా(dasara) సినిమాతో మంచి జోరుమీద ఉన్నాడు నేచురల్ స్టార్ నాని(NANI). తిరుగులేని సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సాలిడ్ సక్సెస్ వచ్చే సరికి నానీ అదే జోష్ తో నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఈ ఊపు తగ్గకముందు తన నెక్ట్స్ మూవీపై కన్నేశాడు.

దసరా(dasara) సినిమాతో మంచి జోరుమీద ఉన్నాడు నేచురల్ స్టార్ నాని(NANI). తిరుగులేని సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సాలిడ్ సక్సెస్ వచ్చే సరికి నానీ అదే జోష్ తో నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఈ ఊపు తగ్గకముందు తన నెక్ట్స్ మూవీపై కన్నేశాడు. ప్రస్తుతం అదే జోష్‌తో నాని30(Nani 30) షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదేలకు లైఫ్ ఇచ్చిన నానీ..ఈసారి ఈసినిమాతో మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. నాని30 సినిమాతో శౌర్యువ్‌(shouryav) అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.

దసరా చూసిన తరువాత ఇప్పటికే ఈ సినిమాపై చాలా వరకు ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయ. భారీ అంచనాలే ఉన్నాయి. పైగా జెర్సీ తరువాత నాని మరోసారి ఈసినిమాలో తండ్రి పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. జెర్సీ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఇక ఈసారికూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వైరల్ అప్ డేట్ బయటకు వినిపిస్తుంది.

ఈ సినిమాలో సర్ప్రైజింగ్ గా.. స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌(shruthi hassan) కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు ఇప్పటికే ఆమె షూటింగ్‌లో కూడా జాయిన్‌ అయినట్లు సమాచారం. ఇక ఈఏడాది టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ రెండు హిట్లు కొట్టింది బ్యూటీ. మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య(Valtheu veeraya) సినిమాతో పాటు.. నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహా రెడ్డి(Veera shima reddy) సినిమాలో నటించి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో మంచి జోష్‌ మీదున్నది.ప్రస్తుతం తెలుగులోప్రభాస్ సరసన సలార్‌ సినిమా చేస్తుంది.

ఇక ఇప్పుడు నాని సినిమాలో కీలకపాత్ర లో శృతి కనిపించబోతుంది అని తెలియడంతో.. ఈసినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. సినిమాపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాలో శృతి హాసన్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు మృణాల్(Mrunal) నాని సరసన మెయిన్ హీరోయిన్ నటిస్తుంది

Updated On 30 April 2023 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story