టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్ రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). ఈమూవీ నుంచి దసరా సందర్భంగా కలర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్.

Ram Charan Game Changer
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్ రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). ఈమూవీ నుంచి దసరా సందర్భంగా కలర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ ఆసక్తికర పోస్టర్ లో ఈమూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు గేమ్ ఛేంజర్ టీమ్ అప్ డేట్ ఇచ్చింది.
'ఆర్ఆర్ఆర్'(RRR)తో ప్రపంచ వ్యాప్తం గుర్తింపు సాధించిన రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ ఇండియన్ సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన స్టార్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలను మించేలా ‘గేమ్ ఛేంజర్’ను తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈమధ్య కాస్త బ్రేక్ లు వచ్చినా.. ఇంకా మిగిలి ఉన్న షూటింగ్ లో త్వరలో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఇక ఈసినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్(SS Thaman) వర్క్ చేస్తున్నారు. తాజాగా ఈమూవీ నుంచి మ్యూజిక్ అప్ డేట్ ను అందించారు టీమ్.
'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి తొలి పాటను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది. దానికి సబంధించిన రామ్ చరణ్ కలర్ ఫుల్ పోస్టర్(Poster) ను రిలీజ్ చేసి.. దసరా శుభాకాక్షలతో పాటు.. దివాళి సందడిని కూడా ముందుగానేస్టార్ట్ చేశారు.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, కియారా అద్వానీ(Kiara Advani), అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య(SJ Suryah), శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తోంది. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఎక్కడ రాజీపడకుండా అంచనాలకు దీటుగా 'గేమ్ చేంజర్'ను నిర్మిస్తున్నారు.
