ఓటీటీ ప్లాట్ ఫామ్ లో వచ్చే సినిమాలకు మంచి వ్యూవర్షిప్ ఉండటంతో చాలా వరకు సినిమాలు ఫస్ట్ ఓటీటీ రైట్స్ ఇచ్చేస్తున్నారు. కొన్ని సినిమాలు థియేటర్లలలో పెద్దగా ఆడకపోయినా సరే ఓటీటీకి వచ్చే సరికి మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంటున్నాయి. మరికొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ ల రికార్డులను షేక్ చేసిన సినిమాలూ ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు ఈ వారం కొన్ని సిరీస్ లు, సినిమాలు తీసు […]

ఓటీటీ ప్లాట్ ఫామ్ లో వచ్చే సినిమాలకు మంచి వ్యూవర్షిప్ ఉండటంతో చాలా వరకు సినిమాలు ఫస్ట్ ఓటీటీ రైట్స్ ఇచ్చేస్తున్నారు. కొన్ని సినిమాలు థియేటర్లలలో పెద్దగా ఆడకపోయినా సరే ఓటీటీకి వచ్చే సరికి మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంటున్నాయి. మరికొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ ల రికార్డులను షేక్ చేసిన సినిమాలూ ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు ఈ వారం కొన్ని సిరీస్ లు, సినిమాలు తీసు కొస్తున్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 8న స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది ’తునివు‘ తమిళ సినిమా. ఈ సినిమాలో అజిత్, మంజువారియర్, సుముద్రఖని నటిస్తున్నారు. కథ మొత్తం క్రైమ్, యాక్షన్ జాన్రాలో సాగుతుటుంది. మూవీని హెచ్ వినోడ్ డైరెక్టే చేశారు. ఈ చిత్రానికి ఎం. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అజిత్ ఫ్యాన్స్ తో పాటు ఓటీటీ వ్యూవర్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ లో విడుదలకు హాలీవుడ్ సినిమా రెడీగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ అవనుంది. రోమాంటిక్ జాన్రాతో ‘యువర్ ప్లేస్ ఆఫ్ మైన్’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు ఎలైన్ బ్రోస్ మెక్ కెన్నా. ఈ సినిమాతో డైరెక్టర్ మెక్ డెబ్యూగా పరిచయం కానున్నారు. ఈ మూవీలో రీజ్ విథెర్స్పూన్, ఆస్టన్ కట్చెర్ నటిస్తున్నారు. అగ్రిగేట్ ఫిల్మ్స్ అండ్ హలో సన్ షైన్ బ్యానర్ పై జాసన్ బ్యాట్మన్, మైఖెల్ కోస్టిగన్ లు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

నైట్రోస్టార్ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హంట్-గన్స్ డోంట్ లై‘. ఈ చిత్రం యాక్షన్, థ్రిల్లర్ జాన్రాలో సాగుతుంది. ఈ మూవీ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ లో ప్లే అవ్వనుంది. మూవీకి మహేష్ సూరపనేని దర్శకత్వం వహించారు. మ్యూజిక్ కంపోజర్ గా జిబ్రాన్, అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Updated On 4 Feb 2023 5:48 AM GMT
Ehatv

Ehatv

Next Story