పఠాన్(Pathan) సినిమాతో సంచలనం సృష్టించిన షారుక్ ఖాన్, జవాన్(Jawan) సినిమాతో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. 60 ఏళ్ళ వయస్సు లో కూడా సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకున్న షారుఖ్..అమ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు. ఇక ఈసారి డిఫరెంట్ లుక్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూనే ఉన్నాడు షారుఖ్ ఖాన్(Shahrukh Khan). 60 ఏళ్ళు వచ్చినా.. ప్రయోగాలు చేయడంలో ఏమాత్రం వెనకడుకు వేయడం లేదు.

పఠాన్(Pathan) సినిమాతో సంచలనం సృష్టించిన షారుక్ ఖాన్, జవాన్(Jawan) సినిమాతో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. 60 ఏళ్ళ వయస్సు లో కూడా సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకున్న షారుఖ్..అమ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు. ఇక ఈసారి డిఫరెంట్ లుక్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కుమార్(Atlee Kumar) ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. షారుక్ సొంత బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా ఇది. అనిరుధ్(anirudh) ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

మొదటి నుంచి కూడా షారుక్ పోస్టర్స్ తోనే 'జవాన్' సినిమాపై అంచనాలు పెంచుతూ వెళుతున్నాడు. షారుఖ్ ఖాన్ కు సబంధించిన డిఫరెంట్ లుక్స్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు జవాన్ రిలీజ్ అవుతుందా అని అభిమానుల్లో ఆత్రుతను కూడా పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి షారుక్ కొత్త పోస్టర్(Poster) ను వదిలారు. చేతిలో రివాల్వర్(Gun) తో .. గుండుతో(Bald) కూడిన స్టైలీష్ లుక్ తో ఆయన ఆకట్టుకుంటున్నాడు.

ఈ పోస్టర్లో షారుక్ గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాడు .. పరిశీలనగా చూస్తేనే షారుక్ అని అర్థమవుతుంది. కొత్తదనం కోసం షారుక్ ఖాన్ వెనుకాడడనే విషయం తెలిసిందే. నయనతార హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ.. నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలను పోషించగా, దీపిక పదుకొణె(Deepika Padukone) ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

Updated On 8 Aug 2023 5:54 AM GMT
Ehatv

Ehatv

Next Story