వాడి కండకావరం కాకపోతే
గుంటూరు కారం(Guntur Karam) సినిమా విలన్ లకు
శ్రామిక వర్గ సైద్ధాంతిక నిర్మాతలు
మానవ చరిత్రలో మహోన్నత శిఖరాలు
మార్క్స్(Marks), లెనిన్(Lenin) ల పేర్లు పెడుతాడా....?
వాడు త్రీవర్ణాల జాతి దుర్నీతికి
వారసుడు
వాడు నైతిక విలువలకు తిలోదకాల ఇచ్చే
విచ్చలవిడి సమాజపు గుంపులో వీడుఒకడు
వాడే త్రివిక్రమ్ శ్రీనివాస్
వాడి కండకావరం కాకపోతే
గుంటూరు కారం(Guntur Karam) సినిమా విలన్ లకు
శ్రామిక వర్గ సైద్ధాంతిక నిర్మాతలు
మానవ చరిత్రలో మహోన్నత శిఖరాలు
మార్క్స్(Marks), లెనిన్(Lenin) ల పేర్లు పెడుతాడా....?
శ్రమ ఆధారిత కళలు, సాహిత్య సాంస్కృతిక వారసత్వానికి చిరునామాగా ఆవిర్భావించిన సినిమా ప్రపంచంలో సైతం
శ్రమ ఆధారిత కళలు, సాహిత్యం, సాంస్కృతిక అంశాలే ప్రధాన భూమికగా చేసుకో నాటి తరం సినిమా నటులు ఎన్టీఆర్(NTR),ఎన్నాఆర్(ANR), కృష్ణ(Krishna), శోభన్ బాబు(Shobhan Babu) లాంటి వారు
నటించిన సినిమాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక దోపిడికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ప్రతిబింబించే విధంగా ఉండేవి.
వాటి కథల రచయితలు, దర్శక నిర్మాతలు కూడా అదే సామాజిక సోయితో సినిమాలు తీసేవారు.
ప్రజా పోరాటాల స్పూర్తితో మాదాల రంగారావు, తరువాత ఆర్ నారాయణ మూర్తి లాంటి ఎన్నో
తెలుగు నేలపై తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని, కుల దురహంకారంతో దళితుల ఊచకోత కోసిన కారంచేడు చుండూరు వేంపెట తదితర ఆధిపత్య కులాల ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక దోపిడి వ్యతిరేకంగా జరిగిన సాంస్కృతిక ప్రత్యామ్నాయంగా కొంత
కృషి జరిగింది.
ప్రపంచంలో ,దేశంలో ప్రజా ఉద్యమాలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టి ఉండవచ్చు.
అంతమాత్రాన,
ఆధిపత్య కులాల దాష్టీక నీతికి వారసులలో ఒకడైన
త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఆధిపత్య దోపిడి ఉన్మాదులు కండకావరంతో కారుకూతలు కూస్తే ప్రజలు తిరగబడే ఒకరోజు వస్తుందని
హెచ్చరిస్తూ....
జైభీం లాల్ సలాంలతో...
దండి వెంకట్