బిగ్‌బాస్‌ షో(Bigg Boss) అప్పుడే సెకండ్‌ వీక్‌లోకి అడుగుపెట్టింది.

బిగ్‌బాస్‌ షో(Bigg Boss) అప్పుడే సెకండ్‌ వీక్‌లోకి అడుగుపెట్టింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో మామూలు రచ్చ జరగడం లేదు. సోనియా(Sonia) అయితే తన నోటి దురుసును ప్రదర్శించుకుంది. కిర్రాక్‌ సీత(Kirak sita), విష్ణుప్రియలను(Vishnu Priya) నానా మాటలు అంది. ఆమె అన్న మాటలు చాలా నీచంగా ఉన్నాయి. వ్యక్తిగత దూషణకు సోనియా దిగడమే చాలా మందికి నచ్చలేదు. రెండో వారం నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా విష్ణుప్రియ ఇద్దరిని ఎంపిక చేసుకుంది. మొదట మణికంఠను నామినేషన్‌ చేసిన విష్ణుప్రియ ఆ తర్వాత సోనియాను నామినేట్‌ చేసింది. ఈ క్రమంలోనే వారిద్దరు తిట్టుకున్నారు. పాపం విష్ణుప్రియ ఏమీ అనలేదు కానీ సోనియానే రెచ్చిపోయింది. చూస్తున్నవాళ్లకు చిరాకుపుట్టించింది. కంపరం కలిగించింది. 'నువ్వు ముందు దుస్తులు సరిగ్గా వేసుకోవు.. అలాంటి దుస్తులతోనే ఇతరుల పక్కన నిల్చుంటావ్‌.. నీ వల్ల వారు డిస్‌కంఫర్ట్ అవుతున్నా సరే వారి పక్కన నిల్చుంటావ్‌. నీ మాటలు, చేతలు హౌజ్‌లో చాలా తేడా ఉన్నాయి' అంటూ విష్ణుప్రియను పర్సనల్ అటాక్‌ చేసింది. అక్కడితో ఆగిందా అంటే అదీ లేదు. 'నీకు ఫ్యామిలీ లేదేమో.. నువ్ ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడకపోవచ్చు, కానీ, నన్ను మాత్రం నా కుటుంబం చూస్తుంది. నిన్ను అడల్ట్స్ జోక్స్ వేయడానికే బిగ్ బాస్ షోకి పిలిచారనుకుంటా.. నన్ను మాత్రం అలాంటివి చేయడానికి పిలవలేదు. గతంలో అడల్ట్ కామెడీ షోలో ఉన్నావ్‌ కాబట్టే బిగ్‌బాస్‌కు పిలిచారు' అంటూ నోటికి ఎంతొస్తే అంత అనేసింది. ఈ ఎపిసోడ్‌ అంతా చూసిన వారు సోనియాను తిట్టిపోస్తున్నారు. సోనియా నోరును డ్రైనేజీతో పోలుస్తున్నారు కొందరు. సోనియాకు తిక్క ఉందన్నారు. సోనియాపై నాగార్జున యాక్షన్‌ తీసుకోవాలని కొందరు రిక్వెస్ట్ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story