యాంకర్‌ శివజ్యోతికి(Anchor Shiva Jyothi) తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ పాపులారిటీ ఉంది. సావిత్రక్కగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ యాస, కట్టుతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు శివజ్యోతి. బిగ్‌బాస్‌(Bigg Boss) షోతో ఆమె మరింత పాపులరయ్యారు. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొన్న శివజ్యోతి టాప్‌ సిక్స్‌ కంటెస్టెంట్‌గా నిలిచారు. షో తర్వాత వరుస అవకాశాలతో బీజీ అయ్యారు.

యాంకర్‌ శివజ్యోతికి(Anchor Shiva Jyothi) తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ పాపులారిటీ ఉంది. సావిత్రక్కగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ యాస, కట్టుతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు శివజ్యోతి. బిగ్‌బాస్‌(Bigg Boss) షోతో ఆమె మరింత పాపులరయ్యారు. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొన్న శివజ్యోతి టాప్‌ సిక్స్‌ కంటెస్టెంట్‌గా నిలిచారు. షో తర్వాత వరుస అవకాశాలతో బీజీ అయ్యారు. తన యూ ట్యూబ్‌ ఛానల్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంటారు. అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటుంటారు. తాజాగా బోనాల పండుగ(Bonalu Festival) సందర్భంగా ఆమె ఒక వీడియోను యూ ట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు.

అందులో తన భర్త గంగూలీ(Ganguli) కొన్న బంగారు నగలను చూపించారు. దీంతో ఆమె భర్తపై నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేశారు. అక్క మీ భర్త ఏ ఉద్యోగం చేస్తారని ఒకరు వ్యాఖ్యనించగా, మరొకరు ఏ ఉద్యోగం చేయాలో ఆలోచిస్తూ ఉంటాడని కామెంట్‌ చేశారు. ఇంకొందరు ఇంతకూ మీరెప్పుడూ పిల్లలు కంటారని కామెంట్లు చేస్తున్నరు. అయితే కొద్ది మంది మాత్ర శివజ్యోతికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇలాంటి కామెంట్లను పట్టించుకోకుండా ముందుకు వెళ్లమంటూ శివజ్యోతిలో కాన్ఫిడెన్స్‌ నింపుతున్నారు. నిజామాబాద్‌(Nizambad) జిల్లా నాగంపేట(Nagampet) గ్రామానికి చెందిన జ్యోతి-గంగూలీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరి ప్రేమ పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని శివజ్యోతినే ఓ సందర్భంలో చెప్పారు. మొదట్లో గంగూలీ ఉద్యోగం చేసేవాడని కూడా తెలిపారు. అయితే ఒక న్యూస్‌ యాంకర్‌గా జర్నీ మొదలు పెట్టిన ఆమెకు బిగ్‌బాస్‌ తర్వాత పలు టీవీ షోలలో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత దంపతులిద్దరూ కలిసి సొంతంగా ఒక యూ ట్యూబ్‌ ఛానెల్‌ను పెట్టుకున్నారు. తాను ఈ స్థాయికి చేరుకోడానికి తన భర్తే కారణమని, ఆయన తనను ఎంతగానో ప్రోత్సహించాడని శివజ్యోతి చాలా సార్లు చెప్పారు. బిగ్‌బాస్‌ షో తర్వాత వీరిద్దరి జంట బాగా పాపులరయ్యింది.

తర్వాత ఇద్దరూ కలిసి అనేక షోలు చేశారు. దీంతో అతను ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సొంత యూ ట్యూబ్‌ ఛానెల్‌ వీడియోలకు సంబంధించిన ఎడిటింగ్‌ పనులను ఆయనే చూసుకుంటున్నాడని శివజ్యోతి తెలిపారు. తన ప్రెగ్నెన్సీ గురించి కూడా శివజ్యోతి చాలా సార్లు వివరించి చెప్పారు. తమకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యిందని, పిల్లల కోసం మా కుటుంబమంతా ఎంతో ఎదురుచూస్తుందని, తాను కూడా వెయిట్‌ చేస్తున్నానని తెలిపారు. ఇది ఎమోషనల్‌గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేనని, ప్రెగ్నెన్సీ అన్నది తన జీవితంలో చాలా పెద్ద విషయమని, తనపై పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా తప్పుగా ప్రచారం చేయకండని, అది తనపై చాలా ఎఫెక్ట్‌ చూపిస్తుందని ఆమె ఆవేదనతో కూడిన అభ్యర్థన చేశారు. బిగ్‌బాస్‌లో చిన్నచిన్న విషయాలకే భావోద్వేగాలకు లోనయ్యే శివజ్యోతికి మాత్రం తల్లి కావాలనే ఎమోషన్‌ ఉండదా? అందులో వారి తప్పేముంది..? రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత సంతానం కలగలేదా ? అంటూ శివజ్యోతికి మద్దుతుగా పలువురు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Updated On 22 July 2023 12:58 AM GMT
Ehatv

Ehatv

Next Story